• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెజాన్ ద్వారా విశాఖ గంజాయి స్మగ్లింగ్; నలుగురు అరెస్ట్, అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకేజ్ మెటీరియల్ సీజ్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ గా సాగుతున్న గంజాయి దందా దేశవ్యాప్తంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా రవాణా అవుతుందన్న విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లో ఆన్లైన్లో గంజాయి విక్రయిస్తున్న ఒక రాకెట్ ను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్న క్రమంలో, వారు గంజాయిని విక్రయించడం కోసం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ను వినియోగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసులో ఇద్దరు అమెజాన్ ఉద్యోగులపై కేసు నమోదు కాగా, విశాఖ కేంద్రంగా గంజాయి అమెజాన్ ద్వారా రవాణాకు పని చేస్తున్న పికప్ బాయ్స్, గంజాయి సరఫరా చేసే మరో వ్యక్తిని ఎస్ఈబీ, మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి దందా: విశాఖ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్; 2.08 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసిన రాచకొండ పోలీసులుగంజాయి దందా: విశాఖ టూ మహారాష్ట్ర వయా హైదరాబాద్; 2.08 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసిన రాచకొండ పోలీసులు

అమెజాన్ ద్వారా గంజాయి దందా .. అమెజాన్ ఉద్యోగులపైనా కేసులు నమోదు

అమెజాన్ ద్వారా గంజాయి దందా .. అమెజాన్ ఉద్యోగులపైనా కేసులు నమోదు

ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఓ దాబా కేంద్రంగా గంజాయి దందా జరుగుతుందని గుర్తించిన మధ్యప్రదేశ్లోని బింద్ పోలీసులు ఆ దాబాపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల నుండి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని విచారించగా ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆన్లైన్ ద్వారా గంజాయి దందా చేస్తున్న కల్లు పావయ్య , ఒక దాబా యజమాని బ్రిజేంద్ర తోమర్ లను భింద్ గ్వాలియర్ రోడ్‌లో అరెస్టు చేసి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భింద్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.

 గంజాయి స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన మధ్య ప్రదేశ్ పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన మధ్య ప్రదేశ్ పోలీసులు

నిందితులు గంజాయి దందా చెయ్యటానికి ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ను వాడుకున్నారన్నది వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా గంజాయి రాకెట్‌ను నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా అమెజాన్ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేశారు. ఏపీ లోని విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి స్మగ్లర్లు ఈ-కామర్స్, కొరియర్ సంస్థల ద్వారా గంజాయిని భోపాల్, కోట, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని గుర్తించిన మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అమెజాన్ డెలివరీ యాప్ నుంచి దాదాపు 1. 10 కోట్లకు పైగా విలువ చేసే గంజాయిని వారు విక్రయించినట్లుగా తెలిపారు. అనేక దఫాలుగా వీరు విశాఖ నుండి సుమారు టన్ను గంజాయిని అక్రమంగా మధ్యప్రదేశ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడం కోసమే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

విశాఖ ఏజెన్సీలో ఎంపీ పోలీసులు, ఎస్ఈబీ అధికారులతో కలిసి నిందితుల అరెస్ట్

విశాఖ ఏజెన్సీలో ఎంపీ పోలీసులు, ఎస్ఈబీ అధికారులతో కలిసి నిందితుల అరెస్ట్

ఇదిలా ఉంటే ఈ కామర్స్ సంస్థ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు గుర్తించిన మధ్యప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా విశాఖకు చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులతో పాటు, ఎస్ఈబి అధికారులు కూడా రంగంలోకి దిగారు. కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ నుండి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు వారు గుర్తించారు. శ్రీనివాస రావు అనే వ్యక్తి గంజాయి సరఫరా చేసినట్లుగా గుర్తించిన వారు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్ తో పాటు కొంత గంజాయి లభించింది. మొత్తం ఈ కేసులో తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

 కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు

కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు

గంజాయి సరఫరాకు శ్రీనివాసరావు సహకరించిన ముగ్గురు పికప్ బాయ్స్ కుమార స్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుబడిన నలుగురు నిందితులు కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు.
గంజాయి స్మగ్లర్ల వల్ల ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇప్పుడు నోటీసులను తీసుకుని న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది.

English summary
MP police and SEB officials have arrested four people in Visakha cannabis smuggling case through Amazon. Amazon stickers from them, package material seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X