Vizag Airport: వైజాగ్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

ఏపీలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటైన విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు నేవీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం విమానాశ్రయంలో రన్ వే మరమ్మత్తుల కారణంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు విమానాలు వచ్చే పరిస్దితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇవి పూర్తి కావడంతో త్వరలో 24 గంటలూ రాకపోకలకు అవకాశం కలగనుంది.

విశాఖ ఎయిర్ పోర్టును నేవీ తూర్పు కమాండ్ నిర్వహిస్తోంది. ఇందులో తాజాగా రన్ వే మరమ్మత్తులు చేపట్టడంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. నేవీకి చెందిన నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాలో రన్ వే నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా ఈ పనులు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి 24 గంటలూ, వారం రోజులూ విమానాల రాకపోకలకు అనుమతించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.

vizag airport runway to be available 24x7 from april 1

విశాఖకు పొరుగున ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తి కాగానే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి భోగాపురానికి విమానాశ్రయం మారుస్తారు. ఆలోపు విశాఖ ఎయిర్ పోర్టు నుంచే విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మధ్యలో రన్ వే మరమ్మత్తులు చేయాల్సి రావడంతో విమానాల రాకపోకల్ని నియంత్రించి ఆ పనులు చేపట్టారు. ఇప్పుడు అవి పూర్తి కావస్తుండటంతో యథావిధిగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+