చంద్రబాబుకు వక్ఫ్ బిల్లు సంకటం ? రేపు ముస్లింల ఛలో విజయవాడ..!
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు మిత్రపక్షాలైన చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కు సంకటంగా మారాయి. ఇప్పటికే రంజాన్ మాసంలో సీఎంలు సంప్రదాయంగా ఇచ్చే ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు బీహార్, ఏపీలో బహిష్కరించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో ముస్లింలు చంద్రబాబు, నితీష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిపై మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్దమవుతోంది.
ఏపీలో వక్ఫ్ బిల్లుకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ టీడీపీపై, సీఎం చంద్రబాబుపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్న చంద్రబాబు ఇఫ్తార్ పార్టీని బహిష్కరించాలని ముస్లిం పర్సనల్ లాబోర్డు ఇచ్చిన పిలుపుతో ఎక్కడికక్కడ ముస్లిం పెద్దలు దీనికి దూరంగా ఉండిపోయారు. దీంతో మైనార్టీ మంత్రి, ప్రభుత్వంలో ముస్లిం నామినేటెడ్ నేతలతో వీటిని నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా విజయవాడలో రేపు మహాధర్నాకు ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపునిచ్చింది.

రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ విజయవాడలోని ధర్నాచౌక్ లో ముస్లింలు వర్గాలకు అతీతంగా మహాధర్నాకు తరలిరావాలని ఇప్పటికే ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేపు ఈ వక్ఫ్ బిల్లు వ్యతిరేక ధర్నాకు ముస్లింలు తరలిరానున్నారు.

వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పార్లమెంట్ లో మద్దతివ్వరాదని ముస్లిం పర్సనల్ లాబోర్డు కోరుతోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని తాజాగా కోరింది. అయితే చంద్రబాబు మాత్రం ఇఫ్తార్ విందు సందర్భంగా వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతానని మాత్రమే ప్రకటన చేశారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications