ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం!

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాలలో అనిశ్చితి నెలకొంది. ఇంధన ధరల పెరుగుదల, గ్యాస్, సిఎన్జి కొరత చిన్న మరియు భారీ పరిశ్రమలు అన్నింటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో అనేక పరిశ్రమలు ఇబ్బంది పడుతుంటే, గ్యాస్, సిఎన్జి కొరతతో సామాన్య కార్మికులు సైతం కష్టాలను అనుభవించక తప్పడంలేదు. ప్రస్తుతం ఆయిల్ మరియు గ్యాస్ ఆధారిత పరిశ్రమలు మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

మూత పడుతున్న చిన్న, కుటీర పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బేకరీలు మూతపడుతున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వ్యాపారాల మీద గ్యాస్ కొరత పిడుగు లాగా పడింది. దీని కారణంగా కార్మికులకు పని ఇవ్వలేమని ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న చిన్న, కుటీర పరిశ్రమలు కార్మికుల పనిని తగ్గిస్తున్నాయి.

War Impact Hits Small Industries in andhrapradesh and telangana Workers Lose Jobs facing problems

వందల సంఖ్యలో చిన్న పరిశ్రమలు మూత

అంతేకాదు మౌలిక వసతులను కల్పించేందుకు, ప్రాజెక్టులు, రోడ్లు నిర్మించేందుకు పెద్ద పనులు చేసే కంపెనీలపైన ఐదు శాతం నుంచి 6 శాతం అదనపు భారం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కువగాడీజిల్ కొనుగోలు చేసే వారికి 20శాతం వరకు అదనపు భారం పడిందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో అనేక ప్రాంతాలలో వందల సంఖ్యలో ఫుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.

కార్మిక లోకం కష్టాలు

గ్యాస్ కొరతతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో కార్మికుల పరిస్థితి గందరగోళంగా మారింది.మరోవైపు గ్యాస్ కొరత, అధిక ధరలు వెరసి షాపులు నిర్వహించడం కష్టంగా మారింది. ప్రతిరోజు గ్యాస్ సిలిండర్లు అవసరం ఉన్న వ్యాపారులు వారానికి ఒకటి కూడా దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా కార్మికులను కూడా తగ్గించుకున్న పరిస్థితి ఉంది. దీంతో కార్మిక లోకం పని లేక తినడానికి తిండి లేక నానా కష్టాలు పడవలసి వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులపై యుద్ధ ప్రభావం

బ్యాంకుల్లో రుణాలు, ప్రైవేట్ అప్పులతో ఇబ్బంది పడే కార్మికుల బ్రతుకు భారంగా మారుతుంది. కుటీర పరిశ్రమలపైన యుద్ధప్రభావం తీవ్రంగా ఉండడంతో దాని ప్రభావం సామాన్య ప్రజల జీవితాన్ని ఆగం చేస్తుంది. మరోవైపు cng ఆటోలు, క్యాబ్ లు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో డ్రైవర్ల బ్రతుకు భారంగా మారుతుంది. అనేక కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటూ అలమటించే రోజులు తెలుగు రాష్ట్రాలలో వారికి వచ్చింది. ఆ పరిస్థితులు యుద్ధం తీసుకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+