వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డి
ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురునాథ రెడ్డి మృతికి కారణం కాగా పోలీసులు కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ప్రస్తుతం గ్రామంలో పికెటింగ్ కొనసాగుతుంది.
గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం విషయంలో జరిగిన ఘర్షణలో వైసీపీ వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి రాడ్లు , రాళ్ళతో కొట్టుకున్నారు .గండి కోట ప్రాజెక్టు ముంపు పరిహారం జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్ రెడ్డి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టడం కోసం మండల స్థాయి గ్రామ సభ నిర్వహించారు . ఈ క్రమంలో వైసిపి కి చెందిన మరొక వర్గం గురునాథ్ రెడ్డితో గొడవకు దిగగా రాడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడిన క్రమంలో గురునాథ్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు . రామసుబ్బారెడ్డి అనుచరుడైన గురునాథ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రామసుబ్బారెడ్డి గురునాథ రెడ్డి హత్య విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో, రామసుబ్బారెడ్డి వర్గీయుడు అయిన గురునాథ్ రెడ్డి హత్యగావించ బడ్డాడు. దీంతో జమ్మలమడుగు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి . వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఓ కార్యకర్త దారుణ హత్యకు కారణమైంది.
Recommended Video
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications