బాబు రహస్య భేటీ:ఎవరితో?, ఢిల్లీలో ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లారు?..

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రహస్య భేటీ నిర్వహించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన.. మధ్యాహ్నాం 3గం. నుంచి రాత్రి 9గం. వరకు ఢిల్లీలో రహస్య భేటీలు జరిపినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడకు చేరుకోవాల్సి ఉన్నా.. రాత్రి 9గం.వరకు సీఎం ఎయిర్ పోర్టు లాంజ్ లోనే ఉన్నట్లు సీఎం సిబ్బంది మీడియాతో చెప్పారు. అయితే ఆ ఆరుగంటల సమయంలో ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ నగరానికి చేరుకుని.. కొంతమంది ఢిల్లీ ప్రమఖులతో ఆయన భేటీ అయినట్లు చెబుతున్నారు.

where chandrababu has gone for six hours in delhi

చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో.. ఆయన ఎవరిని కలిశారనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు. సాయంత్రానికల్లా విజయవాడలో ఉండాల్సిన సీఎం.. షెడ్యూల్ ను పక్కనపెట్టి ఢిల్లీలో ఎవరితో భేటీ అయ్యారో, ఎందుకు భేటీ అయ్యారో స్పష్టమైన సమాచారం లేదు.

కాగా, రాత్రి 9.30గం. సమయంలో చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరారు. శనివారం నాడు మంత్రి నారాయణతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After reaching delhi from America tour, AP CM Chandrababu Naidu was not in available for six hours. Around 9.30pm he started to Vijayawada from AP
Please Wait while comments are loading...