కడప-బాబాయ్ ఓటమి ఎఫెక్ట్: గంటాను జగన్ అందుకే టార్గెట్ చేశారు?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించినందుకు మంత్రి గంటా శ్రీనివాస రావుపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని బీజేపీ శాసన సభా పక్ష నేత గంటా శ్రీనివాస రావు అన్నారు.

అసెంబ్లీలో విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. కడపలో ఓడించినందుకు జగన్ మంత్రి గంటాపై కక్ష కట్టారన్నారు. కాగా, గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిపై టిడిపికి చెందిన బిటెక్ రవి గెలిచిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసి వెళ్లాలి, ప్రకాశ్ రాజ్‌లా: బాధితురాలు

మొగల్తూరు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయు పీల్చి మృత్యువాత పడిన అయిదుగురు యువకుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుబానికి రూ.17లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Why YS Jagan targetting Minister Ganta?

ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.

వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అక్కడి ఎమ్మెల్యేను ఆదేశించారు. అనంతరం దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావు, అయ్యన్నపాత్రుడు హుటాహుటిన మొగల్తూరుకు బయల్దేరి వెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader Vishnu Kumar Raju on Thursday said that YS Jagan is targetting Minister Ganta Srinivas Rao.
Please Wait while comments are loading...