వారికే స్పష్టత లేదు: మోడీపై చంద్రబాబు, అధినేత లీడ్ చేస్తే.. టిడిపి ఎంపీల భయం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు చేయడానికి కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీని నియమించడంపై ఇంకా స్పష్టత లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

ఒక కమిటీ వేయాలని అనుకుంటున్నామని అరుణ్‌ జైట్లీ తనకు ఫోన్ చేసి చెప్పారని, కమిటీకి నేతృత్వం వహించమని అడిగారని తెలిపారు. ఇందుకు చాలా అవరోధాలు ఉన్నాయని, డిజిటల్‌ లావాదేవీలను ప్రజల్లోకి చాలా ఉద్ధృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తాను ఆయనకు చెప్పానన్నారు.

'నరేంద్ర మోడీని చంద్రబాబు చిక్కుల్లో పడేశారు'

ఆ తర్వాత మళ్లీ కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. డిసెంబరు రెండో తేదీన కమిటీ తొలి సమావేశం వార్తల పైన స్పందించారు. కమిటీ సభ్యులకు తెలియకుండానే సమావేశం జరుగుతుందా? అన్నారు. కమిటీ విషయంలో కేంద్రంనే స్పష్టత లేదని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలా? అన్న ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టుగా కనిపిస్తోందన్నారు.

కమిటీపై గడబిడ

నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన కేంద్రం వేస్తున్న ముఖ్యమంత్రుల కమిటికీ అదిలోనే షాక్ తగిలింది. క్యాష్ లెస్ భారత్ ఆవిష్కరణ, నోట్ల రద్దు తర్వాత తలెత్తిన సమస్యల పరిష్కారానికి వివిధ పార్టీలకు చెందిన సీఎంలతో కమిటీ వేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

Will AP CM Chandrababu Refuses to lead CMs Committee?

ఈ కమిటీలో ఉండేందుకు ఇప్పటికే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నో చెప్పారు. పాండిచ్చేరు సీఎం నారాయణ స్వామి కూడా.. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతిస్తే ఉంటానని చెప్పారు. దీంతో నారాయణ స్వామిని సీఎంల కమిటీలో ఉంచేలా సోనియాను ఒప్పించే బాధ్యతను కేంద్రమంత్రి అనంత్ కుమార్‌కు జైట్లీ అప్పగించారు.

ఈజీగా వదలడు, చిరంజీవికి-జనసేనకు సంబంధం లేదు: పవన్‌పై నాగబాబు

కమిటీకి సారథ్యం వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా.. ఆయన ఆలోచించి చెబుతానని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ విషయం తెలియలేదు.

మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జైట్లీ చర్చలు జరుపుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

టిడిపి ఎంపీలకు ఇష్టం లేదు

ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబు సారథ్యం వహించడం టిడిపి ఎంపీలకు ఇష్టం లేదు. చంద్రబాబు నేతృత్వం వహించవద్దని వారు భావిస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వం వహిస్తే ఇబ్బందుల వస్తాయని వారు భావిస్తున్నారు.

కమిటీకి చంద్రబాబు సారథ్యం వహిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కమిటీ అనేది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదని వారు చెబుతున్నారని తెలుస్తోంది. ఎవరికీ చెప్పకుండా నోట్లు రద్దు చేసిన మోడీనే పర్యావసనాలను ఎదుర్కోవాలని, పరిష్కార మార్గాలను సీఎంల కమిటీ ఎందుకు సూచిస్తుందని గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Will AP CM Chandrababu Refuses to lead CMs Committee?
Please Wait while comments are loading...