వాళ్లను ప్రాణాలతో వదలం-పవన్ నో అంటే అక్కడికెళ్తాం..! కోట వినుత డ్రైవర్ సోదరి వార్నింగ్..!
ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాహళహస్తికి చెందిన జనసేన నేత కోట వినుత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవర్ హత్య కేసులో కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబును చెన్నై పోలీసులు అరెస్టు చేయగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పవన్ కళ్యాణ్ కు ఈ తలనొప్పి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. తాజాగా కోట వినుత చేతిలో హత్యకు గురైనట్లు చెబుతున్న డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించారు.
15 ఏళ్లుగా తన అన్న శ్రీనివాసులు (రాయుడు) జనసేన పార్టీలో వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడని ఆయన సోదరి కీర్తి తెలిపారు. తాజాగా తన అన్న కాలుకి దెబ్బ తగిలిందని చెప్పి పిలిపించారని, అక్కడికి వెళ్తే ఐదుగురు కూర్చుని మధ్యలో ఆయన్ను కూర్చోబెట్టి ఉంచారన్నారు. తమను ఏమీ మాట్లాడనివ్వలేదన్నారు. కాలుకు దెబ్బతగిలిందని మాత్రమే చెప్పారన్నారు. ఆ తర్వాత తన అన్నను చంపేశారన్నారు. అప్పుడు తమకు కనిపించిన ఐదుగురే ఈ హత్య కేసులో ఉన్నారన్నారు.

దీన్ని ఇంతటితో వదిలేది లేదని, తమకు న్యాయం చేయాలని కీర్తి తెలిపింది. తాము నమ్ముకున్న జనసేన పార్టీ ద్వారానే న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, అక్కడ న్యాయం జరగకపోతే వేరే పార్టీ ద్వారా అయినా పోరాటం చేస్తామన్నారు. నిందితుల్ని పోలీసు స్టేషన్ లో ఉంచి కొన్ని రోజులు తర్వాత వదిలేస్తే ఇంకొకరికి ఇలాగే జరిగే అవకాశం ఉందన్నారు. నిందితుల్ని ప్రాణాలతో వదలమని తేల్చిచెప్పేశారు. వాళ్లను కూడా ఏదో ఒకటి చేయాలన్నారు. ఈ విషయం పవన్ వరకూ వెళ్లాలన్నారు.

నిందితులు బయటికి వస్తే తమ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. తమ అవ్వను కోట వినుత మనుషులు తీసుకెళ్లారని, డబ్బు ఇచ్చి తమను కొనాలని ప్రయత్నించారన్నారు. అయితే తాము లొంగలేదన్నారు. జనసేన పార్టీని తమకు న్యాయం చేయాలని కీర్తి కోరింది. అలా జరగకపోతే వేరే పార్టీ ద్వారా పోరాడతామన్నారు. ఎంత తప్పు చేసినా తమ అన్నను చంపే హక్కు వారికి లేదన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications