రేవంత్ మనిషిని పవన్ టచ్ చేస్తారా ? బాబు సపోర్ట్ దొరుకుతుందా ?
ఏపీలో గత ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, విజయం తర్వాత ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య ఓ విషయంలో చిర్రెత్తుకొచ్చింది. తన తాజా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు సిద్దమవుతున్న వేళ ఏపీలో థియేటర్లను బంద్ చేయాలంటూ కొందరు ఇచ్చిన పిలుపు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో వారిపై ఉరుముతూ విచారణకు ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత వారిలో ఒకరైన దిల్ రాజు జనసేన పార్టీ నేతే ఇందుకు కారణమని చెప్పడం, అనంతరం ఆయన్ను పవన్ సస్పెండ్ చేయడం జరిగిపోయాయి.
ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు కథ ఇప్పుడే మొదలైంది. పవన్ కళ్యాణ్ తన పార్టీకే చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో తాజాగా భేటీ అయ్యారు. ఇందులో థియేటర్ల బంద్ వ్యవహారం సద్దుమణిగినా దీని వెనుక ఉన్న అసలు దోషుల్ని మాత్రం వదలొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు బంద్ పేరుతో తన సినిమా రిలీజ్ కాకుంండా అడ్డుకున్నారనే ఆక్రోశంతో థియేటర్లలో తనిఖీలకు సైతం ఆదేశాలిచ్చేశారు. దీంతో తనిఖీలు కూడా మొదలయ్యాయి. ఈ తనిఖీలతో ఏం జరగబోతోందన్న దాన్ని పక్కనబెడితే అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది దిల్ రాజే అంటూ జనసేన బహిషృత నేత సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ ను ఆలోచనలో పడేశాయి.

థియేటర్ల బంద్ పిలుపు వెనుక దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారంటూ జనసేన బహిషృత నేత అత్తి సత్యనారాయణ బహిరంగంగా చెప్పేసినా వీరిపై చర్యలు తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించలేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు రాష్ట్రాల థియేటర్లను చేతిలో పెట్టుకుని ఆడిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఈ చతుష్టయంపై, ముఖ్యంగా వీరిని ఆడిస్తున్న తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజుపై పవన్ ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా పేరున్న దిల్ రాజును టచ్ చేసి టార్గెట్ చేయడం పవన్ కు సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన నేత ఉన్నారంటూ అత్తి సత్యనారాయణను ఇరికించింది దిల్ రాజే. అయితే తన పాత్ర లేదంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడంతో ఇప్పుడు దిల్ రాజుపై ఆయనతో పాటు ఉన్న మరో ముగ్గురిపై పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటారన్న ప్రశ్న ఎదురవుతోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ టాలీవుడ్ చతుష్టయం బలపడుతూనే ఉందన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో లేని థియేటర్ల బంద్ కు కారణమంటూ వీరిపై పవన్ కళ్యాణ్ కేసులు నమోదు చేయిస్తారా ? లేక వీరి చేతుల్లో ఉన్న థియేటర్లలో సౌకర్యాలపై టార్గెట్ చేస్తారా ?ఈ పరిణామాలు అంతిమంగా తన సినిమాలపైనా ప్రభావం చూపేలా చేసుకుంటారా అన్న చర్చలు జరుగుతున్నాయి. అన్నింటికంటే మించి ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో పవన్ దూకుడుకు సహకరిస్తారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.
-
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications