కరోనాను పంపమని భార్యలు దేవుణ్ణి ప్రార్థించారు.. భూమ్మీద పెద్ద వైరస్ మనుషులే : వర్మ
కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న వైరస్ . ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ .. ఇక దీంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రజల్లో అవగాహన కల్పించటానికి, కరోనా నుండి కాపాడటానికి సర్కార్ నడుం బిగించింది . ఇక వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్ విషయంలో మొదట నుండి తనదైన స్టైల్ లో స్పందిస్తున్నారు .

కరోనా వైరస్ పై విభిన్నంగా స్పందిస్తున్న రాం గోపాల్ వర్మ
మొన్నటికి మొన్న కరోనాకు పెద్ద చిన్నా అనే తేడా లేదని ఈ వైరస్ దెబ్బకు దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూసేశారని పేర్కొన్న వర్మ కరోనా మామూలు ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా పెద్ద గుణపాఠం నేర్పిందంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తాజాగా మనుషులే పెద్ద వైరస్ అంటూ సంచలన ట్వీట్ చేశారు రాం గోపాల్ వర్మ. ఇక కేపాల్ కు కూడా మీ దేవుడికి చెప్పి కరోనాను తగ్గించు లేదా నాకు కరోనాను రప్పించు అని సెటైర్లు వేశారు. ఇక పోలీసులు బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, సంపూర్ణేష్ బాబులా ప్రవర్తించకూడదని అన్నారు.

భూ గ్రహానికి పట్టిన వైరస్ మనుషులని షాకింగ్ కామెంట్స్
తాజాగా మనుషులను ఉద్దేశించి ట్వీట్ చేసిన వర్మ భూ గ్రహానికి పట్టిన వైరస్ మనుషులని షాకింగ్ కామెంట్స్ చేశారు . కరోనా వైరస్‌పై మొదట నుండి తనదైన శైలిలో స్పందిస్తున్న ఆయన భూమిపై ఉన్న జీవుల్లో మనుషులు మాత్రమే తమ సొంత ప్రాంతంలో ఉండకుండా ఎల్లప్పుడూ సంచారం చేస్తుంటారన్నారు. ఇక ఉన్నదాన్ని రెట్టింపు చేసుకోవాలని ఎల్లప్పుడు ప్రయాణిస్తూ భూమికి సంబంధించిన సహజ వనరులను నాశనం చేస్తుంటాడు అని మనిషి నైజాన్ని చెప్పారు.

భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు.. మానవులకు పట్టిన రోగం వైరస్
ఇక అంతే కాదు ఇదే రకమైన పని చేసే మరో జీవి వైరస్ మాత్రమేనన్నారు. భూ గ్రహానికి పట్టిన జబ్బు మానవులు అయితే మానవులకు పట్టిన రోగం వైరస్ అని రాం గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎవరికి వారు స్పందిస్తున్నారు. కొందరు మానవ తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని చెప్తూ వర్మ అభిప్రాయానికి మద్దతు పలికితే కొందరు వర్మ చేసిన కామెంట్ ను వ్యతిరేకిస్తున్నారు.

కరోనాను పంపమని భార్యలు దేవుణ్ణి ప్రార్థించారని అనుమానం
ఈ వైరస్ పంపమని కొందరు భార్యలు దేవుణ్ణి ప్రార్థించారని అనుమానం అంటూ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు . ఇక అందుకు ఆయన చెప్పిన కారణాలు-. 1. స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేయబడ్డాయి 2.బార్లు మరియు పబ్బులు మూసివేయబడ్డాయి 3. స్నేహితులతో కలిసి తిరగటం రద్దు చేయబడింది 4. కార్యాలయంలో పని ఉందని అబద్ధం చెప్పటం కూడా కుదరదు కనుక భార్యతో మాత్రమే సమయం గడపవలసిన తరుణం అంటూ భార్యలు భర్తల మీద కక్ష సాధించేందుకే ఈ వైరస్ ను పంపమని అడిగారని నా అనుమానం అని ఆయన పేర్కొన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications