వైసీపీ అభ్యర్థి వింత చేష్టలు .. పీక్స్ టైమ్ లో వైసీపీ కి తలనొప్పులు
ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో వింతలు, విశేషాలే కాదు, వెకిలి మాటలు , పిచ్చి చేష్టలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఏపీలో ఈసారి ఎన్నికల కోలాహలం ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తుంది.

పిచ్చి పట్టిన వాడిలా వింతగా ప్రవర్తిస్తున్న వైసీపీ అభ్యర్థి
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అసలే ఎండాకాలం కావటంతో , అందులోనూ పొలిటికల్ హీట్ కాక రేపుతున్న తరుణంలో నేతలు ఎక్కడికక్కడ తమ ప్రసంగాలతో పిచ్చెక్కిస్తుంటే, అచ్చం పిచ్చిపట్టిన వ్యక్తిలా ప్రవర్తించి వైసీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి స్థానికులకు చుక్కలు చూపించడం విస్మయానికి గురి చేసింది . ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయమే ఒంటరిగా వీధుల్లోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ వింతగా ప్రవర్తించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

వీధుల్లో తిరుగుతూ వింత ప్రశ్నలు.. షాక్ అవుతున్న స్థానికులు
ఒక కోటి ఇరవై రెండు లక్షలు...హహ్హా హ్హా..అంటూ వీధుల్లో పిచ్చివాడిలా గెంతుతూ ఎదురుగా వచ్చిన వారిని ఆపి వింత ప్రశ్నలు వేయడంతో పలువురు షాక్‌కు గురవుతున్నారు. ఆయన గతంలో ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన ప్రవర్తనా తీరు వింతగా వుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

గతంలో బాగానే ఉన్న నేత .. అభ్యర్థి వింత ప్రవర్తన కారణంగా వైసీపీ కి తలనొప్పి
2009లో పీఆర్పీ తరుపున ప్రచారం చేసిన సందర్భంలో కానీ, 2014లో వైసీపీ తరుపున ప్రచారం చేసిన సందర్భంలో వరప్రసాద్ ప్రవర్తన ఈ విధంగా లేదని, అతనికి ఏదో అయ్యిందని కొంత మంది చెబుతున్నారు. మరి కొంత మందేమో వరప్రసాద్ మధ్యం మత్తులో ప్రచారం చేస్తూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు. ఏది ఏమైనా వరప్రసాద్ ప్రవర్తనతో గెలిచే స్థానాన్ని వైసీపీ పోగొట్టుకున్నట్టేనని నియోజక వర్గ వాసులు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు దగ్గర పడిన ఈ పీక్స్ టైం లో వైసీపీ కి ఈ నేత తీరు పెద్ద తలనొప్పిగా మారింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications