అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కూటమి ప్రభుత్వం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పైన వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే అల్లు అర్జున్ అరెస్టు జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరపడ్డారని, దీని వెనుక కూటమి ప్రభుత్వ ప్రోద్బలం ఉందని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
వారికి పుట్టగతులుండవు
కళాకారులను విమర్శించే వారికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనపైన మాట్లాడిన ఆయన ఆ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అయినప్పటికీ దానికి అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తూ అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఇక తన అరెస్టుకు కూడా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

తనను అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరిన దువ్వాడ
41 ఏ నోటీసుల జారీపైన పోలీసులను కోర్టుకు ఈడుస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక తనకు ఇచ్చిన నోటీసులలో పోలీసులు తనను ఎక్కడికి ఏ తేదీన రావాలో చెప్పలేదని పేర్కొన్నారు తాను ఎక్కడికి వెళ్ళేది లేదని తనను ఎవరు వచ్చే అరెస్టు చేస్తారో చూస్తానంటూ సవాలు విసిరారు.
కేసులు తనకు కొత్త కాదన్న దువ్వాడ
అంతేకాదు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను దివ్వల మాధురిని దుర్భాషలాడారని పదే పదే ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే తాము వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక కేసులు తనకు కొత్త కాదని 18 కేసుల్లో ఏవన్ గా ఉన్నానని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చెయ్యాలి
ఇక తనను అరెస్టు చేసే ముందు పవన్ కళ్యాణ్ ని కూడా అరెస్టు చేసి అప్పుడు తన వద్దకు రావాలని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. మొత్తంగా దువ్వాడ శ్రీనివాస్ తనకు నోటీసులు జారీ చేసిన ఎపిసోడ్ తో పాటు అల్లు అర్జున్ అరెస్టు వెనుక కూడా కూటమి కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications