చాకలి అని పిలిచారా ... జైలుకు పంపిస్తారు ... ఎక్కడో తెలుసా
అలవాటులో పొరపాటు అని చాకలి అని పిలిచారు అంటే జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుంది అంటున్నారు మన పొరుగు రాష్ట్ర రజకులు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం రజకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రజక వృత్తి ని తక్కువ చేసే పదాలను నిషేధించింది. చాకలి, చాకలోడు అనే పదాలపై నిషేధం విధించింది. ఇకపై బట్టలు ఉతకడాన్ని వృత్తిగా జీవిస్తున్న వారిని గౌరవిస్తూ రజకులని పిలవాలి. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే అని చెప్పటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
రజకులను కులం పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఇకనుండి ఎవరైనా రజకులను చాకలి, చాకలోడు అని పిలిస్తే జైలుకి పంపిస్తారు. ఆ పదాలు అవమానకరంగా ఉన్నాయని, అందువల్ల వాటిని నిషేదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏ కుల వృత్తి తక్కువ కాదని, రజక వృత్తి ని కూడా గౌరవంగా చూసేలా, రజకుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రజకులను 'చాకలి', 'చాకలోడు' తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి అవమానకర పేర్లను నిషేధించాలని ఏపీ వాషర్‌మెన్ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో చాకలి, చాకలోడు అనే పదాలను నిషేధిస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బుధవారం (ఫిబ్రవరి-21-2019) ఉత్తర్వులు జారీ చేశారు. ఇకనుండి రజకులను పిలిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిలవాలి.. లేకుంటే జైలుకు పంపించడం పక్కా అని దీని సారాంశం.












Click it and Unblock the Notifications