బుట్టా రేణుకపై జగన్ కామెంట్స్.. షాకయ్యే వీడియోతో టీడీపీ కౌంటర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. మేమంతా సిద్ధమంటూ జగన్ దూకుడుగా ముందుకు వెళుతుంటే, చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నేటి నుండి జనసేన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుండి సమర శంఖాన్ని పూరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేలా అన్ని పార్టీల అధినేతలు తమదైన శైలిలో ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక వైయస్ జగన్ ప్రసంగాన్ని టార్గెట్ చేసే పనిలో ఉన్న టిడిపి ఆయన చేసిన వ్యాఖ్యలను తీసుకొని కౌంటర్లు రెడీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ, సోషల్ మీడియా వేదికగానూ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అసలు వాస్తవిక పరిస్థితిని, పాత వీడియోలను వెలికి తీసి మరీ టార్గెట్ చేస్తున్నారు.

ys jagan comments on butta renuka tdp counter to jagan with an shocking video

తాజాగా కర్నూలు ఎమ్మిగనూరు సభలో మాట్లాడిన జగన్ బుట్టా రేణుక గురించి చేసిన వ్యాఖ్యలను టిడిపి టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోతో పాటు, బుట్టా రేణుక ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక వీడియోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, జగన్ ఎన్ని మాయమాటలు చెప్పిన జనాలు బుట్టలో పడరని టిడిపి సెటైర్లు వేసింది.

ఇక ఇంతకీ జగన్ ఏం మాట్లాడాడు అంటే.. బుట్టా రేణుక కు ఓటు వేయాలంటూ చెప్పుకొచ్చిన జగన్.. పాపం బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆర్ధికంగా చాలా బలవంతురాలు అయిన బుట్టా రేణుక ని గురించి జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన టిడిపి, బుట్ట రేణుక తన ఆస్తుల గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా షేర్ చేసింది.

అంతేకాదు లక్షల కోట్లతో దేశంలోనే రిచెస్ట్ సియం జగన్ రెడ్డికి, వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉన్న బుట్టా రేణుక గారు నిరుపేద అంట అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టిడిపి జగన్ ఈసారి నువ్వు ఎంత బుట్టలో వేసుకోవాలి అనుకున్నా ప్రజలు మాత్రం పడరు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+