జగన్ కు బీఆర్ఎస్ సవాల్ ? వైసీపీ మద్దతిస్తే ఇలా.. దూరం పెడితే ఇలా.. !

ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలతో సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో ఉండవల్లితో గతంలోనే సంప్రదింపులు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వంటి వారితోనూ టచ్ లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఓ ఎత్తయితే ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ.. బీఆర్ఎస్ విషయంలో ఎలా వ్యవహరించబోతోందనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ విషయంలో వైసీపీ

బీఆర్ఎస్ విషయంలో వైసీపీ

తెలంగాణలో పుట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పుడు కర్నాటకతో పాటు ఏపీలోనూ ముందుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ను స్వాగతించే విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎంట్రీని వైసీపీ స్వాగతిస్తుందా లేక లైట్ తీసుకుంటుందా లేక భాగస్వామిగా మార్చుకుంటుందా అన్న అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే వీటి ఆధారంగానే భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి కనుక.

బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిస్తే ?

బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిస్తే ?

ఒకవేళ కేసీఆర్ జాతీయపార్టీ బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిస్తే ఏపీ రాజకీయం మరింత వన్ సైడ్ గా మారడం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కు, ఇక్కడ ఇప్పటికే బలంగా ఉన్న జగన్ కూడా తోడయితే ఇక వీరిద్దరినీ ఎదుర్కోవడం ఇక్కడి విపక్షాలకు మరింత కష్టంగా మారడం ఖాయం. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను ఏపీలోనూ అమలు చేస్తే ప్రభుత్వానికి మరింత మైలేజ్ ఖాయం. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలను అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటన కూడా చేశారు. దీంతో ఏపీలో పథకాలకు తెలంగాణ పథకాలు కూడా తోడవుతాయి. అలాగే హైదరాబాద్ అభివృద్ధి మోడల్ కూడా ఏపీకి తోడవుతుంది. అలాగే జగన్ మోడల్ కంటే కేసీఆర్ తెచ్చే తెలంగాణ మోడల్ ను జనం రిసీవ్ చేసుకుంటే అప్పుడ ఆ మైలేజ్ బీఆర్ఎస్ ఖాతాలో పడటం ఖాయం. అటు వైసీపీ పొత్తు కంటే పరోక్ష మద్దతిచ్చే అవకాశాలు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓ ప్రత్యేకవాది, మరో సమైక్యవాది తోడయితే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది.

బీఆర్ఎస్ ను వైసీపీ దూరం పెడితే ?

బీఆర్ఎస్ ను వైసీపీ దూరం పెడితే ?

బీఆర్ఎస్ ను వైసీపీ మద్దతివ్వకుండా, పట్టించుకోకుండా దూరం పెడితే కూడా పలు సమస్యలు ఉంటాయి. ఇందులో ప్రధానమైనది ఏపీలో జగన్ అమలు చేస్తున్న పథకాలను కాదని తెలంగాణలో తన సక్సెస్ మోడల్ ను అమలు చేస్తామని కేసీఆర్ ముందుకు రావచ్చు. అప్పుడు విపక్షాలు కూడా తెలంగాణ మోడల్ ను స్వాగతిస్తే అప్పుడు జనం దృష్టి కూడా దానిపై మళ్లడం ఖాయం. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలకమైన అంశాల్లో తెలంగాణ మద్దతిస్తామని, అలాగే జల వివాదాలకు కూడా ఫుల్ స్టాప్ పెడతామని కేసీఆర్ ఆఫర్ చేస్తే, విపక్షాలు కూడా ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తే అప్పుడు వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అదే సమయంలో బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీతో తెలంగాణలో పోటీకి ఉవ్విళ్లూరుతున్న టీడీపీ వంటి పార్టీలకు లైన్ క్లియర్ కావడం ఖాయం.

జగన్ కు బీఆర్ఎస్ సవాల్ ?

జగన్ కు బీఆర్ఎస్ సవాల్ ?

బీఆర్ఎస్ ను ఏపీలో ఆహ్వనించినా, పట్టించుకోకుండా దూరం పెట్టినా జగన్ కు సమస్యలు తప్పేలా లేవు. దీంతో జగన్ ఆచిచూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి ఉంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై మీడియా ప్రశ్నకు తాజాగా వైసీపీ కీలక నేత సజ్జల మాట్లాడుతూ ఏపీలో ఎవరైనా రావొచ్చు, పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిస్తుందా లేదా పొత్తు పెట్టుకుంటుందా అన్న ప్రశ్నకు మాత్రం జగన్ దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అంటే ఇప్పటివరకూ బీఆర్ఎస్ ఎంటర్ కాలేదు కాబట్టి దాని విధానాలు కూడా తెలియదు కాబట్టి వైసీపీతో పాటు జగన్ కూడా వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారని భావించవచ్చు. ఓసారి ఎంట్రీ ఇచ్చాక మాత్రం జగన్ పార్టీ నేతలతో దీనిపై చర్చించి తమ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అయితే ఇప్పటికే పొత్తుల విషయంలో టీడీపీ-జనసేనపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ... బీఆర్ఎస్ తో పొత్తు మాత్రం పెట్టుకోకపోవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+