వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకులాంటి వాడనే జగన్‌కు బెయిల్: డిగ్గీపై ఉమా

|
Google Oneindia TeluguNews

Devineni Uma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు కొడుకు లాంటి వాడని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. దిగ్విజయ్ సింగ్‌కి జగన్ కొడుకు లాంటి వాడు కాబట్టే అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైనా అతనికి కాంగ్రెస్ బెయిల్ ఇప్పించిందని అన్నారు.

సీమాంధ్ర 70రోజులుగా ఆందోళనలు, సమ్మెలతో అట్టుడుకుతుంటే కేంద్రానికి చీమ కుట్టనిట్లు కూడా లేదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దీక్ష చేస్తుంటే.. కాంగ్రెస్ కుట్రలు పన్ని భగ్నం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

దిగజారి మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. జగన్ తన కొడుకు లాంటి వాడన్న దిగ్విజయ్ సింగ్... జగన్మోహన్ రెడ్డి 16నెలలపాటు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

దిగ్విజయ్ సింగ్ తన స్థాయి దిగజారి మాట్లాడాతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని కలిపి ఒకే గాటన కట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ఇంతకాలం దిగ్విజయ్ సింగ్‌కి కనిపించలేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

English summary
TDP Leader Uma Maheshwara Rao said on wednesday that YSR Congress Party President YS jagan granted bail by Congress and It is proved by the Congress State Incharge Digvijay Singh's statement on Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X