జగన్ బాహుబలి-లోకేష్‌కు చదవరాదు, బాబు గజినీలా మారి: వైసిపి అనిల్

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బాహుబలి అయితే, టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ బ్రహ్మానందం క్యారెక్టర్ లాంటి వారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

గుంటూరులో రైతు దీక్ష ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. నారా లోకేశ్‌కు ఏమీ తెలియదన్నారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని, ఆయనకు కనీసం పేపర్ చదవడం కూడా సరిగ్గా రాదని విమర్శించారు.

ys jagan - nara lokesh

భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఆ పార్టీ నాయకులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా వెళుతున్నారని తాను అనుకోవడం లేదన్నారు. గజినిగా మారిపోయిన చంద్రబాబు ట్రీట్మెంట్ కోసమే అమెరికాకు వెళుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLA Anil Kumar Yadav on Monday said that YS Jaganmohan Reddy is Bahubali.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి