పోలవరంపై తప్పుడు ప్రచారం-నమ్మొద్దన్న సీఎం జగన్-అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు..
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఇవాళ పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న ప్రచారం, ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్నిఖండించేందుకు ప్రభుత్వం ఈ చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలో సభలో చర్చ చేపట్టిన తర్వాత చివరిగా సీఎం జగన్ తన సమాధానం చెప్పారు.
ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, ఆలస్యంపై జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ ఇవాళ అసెంబ్లీలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై ఎల్లో మీడియాలో కథనాలు చూశానని, పోలవరం పనులన్నీ చంద్రబాబే చేశారని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు పోలవరం ప్రాజెక్టు పేరు పలికే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలవరం నిధులన్నీ దోచేశారని, చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నట్లు ప్రధాని మోడీ కూడా చెప్పారని జగన్ గుర్తుచేశారు.

స్పిల్ వే పనుల్ని మధ్యలో వదిలేసి కాఫర్ డ్యాం పనులు చేపట్టారని, దీంతో కాఫర్ డ్యాంలో పెద్ద గుంతలు పడ్డాయని జగన్ తెలిపారు. స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనులు బుద్ధిలేకుండా ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఇలాంటి అనాలోచిత చర్యల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరం పనులు చేసినట్లు ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని జగన్ కోరారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కు పోలవరం ప్రాజెక్టు పేరెత్తే అర్హత లేదన్నారు.
పోలవరం అంటే వైయస్ఆర్…
— YSR Congress Party (@YSRCParty) March 23, 2023
వైయస్ఆర్ అంటే పోలవరం…
ప్రారంభించింది నాన్నే…
పూర్తి చేసేదీ ఆయన కొడుకే… 🔥
- సీఎం వైయస్ జగన్#APAssembly #Polavaram @ysjagan pic.twitter.com/Gy84p7jX1A
కేంద్ర జలసంఘం చెప్పిన ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందని జగన్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని కోరారు. 45.7 మీటర్లు ఎత్తు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం అంశంపై తాజాగా ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు జగన్ తెలిపారు.
ఎల్లో మీడియా, దత్త పుత్రుడిని అడ్డం పెట్టుకుని ఒక అబద్ధాన్ని చెప్పిందే వందసార్లు చెప్పి అది నిజం అని ప్రజలు అనుకునేలా ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట.
— YSR Congress Party (@YSRCParty) March 23, 2023
- సీఎం వైయస్ జగన్@ysjagan #APAssembly pic.twitter.com/UOaYKImOsE
-
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications