హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌పై చింతమనేని ఘాటు వ్యాఖ్యలు: 'ఆరోజే మందలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం పనితీరుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో అన్యాయంగా ఈ కాల్‌మనీ గ్యాంగ్ మహిళలను సెక్స్ రాకెట్ రొంపిలోకి దించుకున్నారని తెలిపారు.

మహిళలకు అధిక వడ్డీలకు డబ్బులిచ్చి వాళ్లను మభ్యపెట్టి వాళ్ల పరిస్థితిని ఆసరాగా తీసుకుని, అనంతరం వీడియోలు తీసి వారిని శాశ్వత వేస్యలుగా చేస్తున్నారన్నారు. కాల్‌మనీ దందా విజయవాడలో బయటపడితే, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయమున్న టీడీపీ నేతలను కాపాడేందుకే ఇలా చేశారని మండిపడ్డారు. శీతాకాల సమావేశాల్లో అంబేద్కర్ ఇష్యూ లేకపోయినా, దానిని కావాలనే చర్చలో పెట్టారన్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్ధితి ఇంత దారుణంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు పాలనే కారణమన్నారు.

ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఆరోజే అక్షింతలు వస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రితికేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోతే, ఈ కేసులో సాక్ష్యాత్తూ ప్రిన్సిపాల్ బాబూరావు ప్రమేయం ఉంటే అతనిపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

కొల్లూరులో అక్రమంగా రోడ్డు వేసి, ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఆరోజు చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ధర్నాకు దిగిన అంగన్ వాడీ మహిళలపై ఎమ్మెల్యే చింతమనేనిని మందలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.

Ys Jagan response on call money issued at Assembly

అనంతరం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. ప్రతిపక్ష నేత సత్యదూరమైన మాటాలు మాట్లాడుతున్నారని అన్నారు. తాత, తండ్రి, జగన్‌దే నేర చరిత్ర కలిగిన కుటుంబమన్నారు.

హత్యాచారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారని మండిపడ్డారు. తాను ఎమ్మార్వో వనజాక్షిని దుర్భాషలాడలేదని, ప్రతిపక్ష నేతకు చెందిన టీవీ, పేపర్ ఆ విషయాన్ని పెద్దదిగా చేసిన చూపిందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నాపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని, ఎటువంటి విచారణకైనా సిద్దమేనని ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు.

కాల్‌మనీ వ్యవహారంపై చర్చించేందుకు సమయం ఇస్తే అనవసర విషయాలు చర్చిస్తూ చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలను చూపించాలన్నారు. డ్వాక్రా మహిళలు సంఘటనను జగన్ మీడియా వక్రీకరించి చూపించిందన్నారు.

అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ ఇలాంటి వాళ్లను మందలించకనే ఈ వ్యవస్థ ఇలా తయారైందన్నారు.

English summary
Ys Jagan response on call money issued at Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X