జగన్-షర్మిల భేటీపై ఉత్కంఠ-కొడుకు పెళ్లికి ఆహ్వానం-కాంగ్రెస్ లో చేరికపై చర్చ ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఇవాళ ఆయన సోదరి, కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధమైన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవాళ కలుసుకోబోతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు షర్మిల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్న జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే జగన్-షర్మిల మధ్య అభిప్రాయ భేదాలతో తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని ప్రారంభించడంతో పాటు కాంగ్రెస్ లో చేరి ఏపీలో ప్రత్యర్ధిగా మారేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి అన్న వైఎస్ జగన్ ను ఆహ్వానించేంందుకు తాడేపల్లి వెళ్తున్నారు. నిన్న ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రిక ఉంచి ప్రార్ధనలు జరిపిన షర్మిల.. ఇవాళ అన్నకు ఆహ్వాన పత్రిక అందించేందుకు వెళ్తున్నారు. అయితే ఇది సాధారణ పరిస్ధితుల్లో అయితే పెద్దగా సంచలనం అయ్యేది కాదు. కానీ రెండు కారణాలతో ఇవాళ వైఎస్ జగన్, షర్మిల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ys Sharmila meeting brother Ys Jagan today to invite sons marriage ahead of Congress joining

కాంగ్రెస్ పార్టీలో తాను చేరడంతో పాటు తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసేందుకు రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ముహుర్తం సిద్ధం చేసుకున్న వైఎస్ షర్మిల.. ఏపీని తన తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అలాగే అన్న వైఎస్ జగన్ తో విభేదించడం మొదలుపెట్టాక ఆయన్ను కలవలేదు. వైఎస్సార్ జిల్లాకు వెళ్లినా, ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్దకు వెళ్లినా అన్నా చెల్లెళ్లు విడివిడిగానే వెళ్లి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వీరిద్దరూ చాలాకాలం తర్వాత కలవబోతున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని మోసం చేసిందని, తన తండ్రిని హత్య చేయించిందని, అన్న జగన్ ను జైలుకు పంపిందని గతంలో పాదయాత్రలో ఆరోపణలు చేసిన షర్మిల.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంతే కాదు ఏపీలో అన్న జగన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా మారబోతున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా అన్న ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నుంచి పెద్దగా స్పందన లేదు. అయితే ఇదే అంశంపై అన్నకు ఓ మాట చెప్పి ఢిల్లీ బయలుదేరి వెళ్లేందుకు షర్మిల సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+