కూటమి సర్కార్ లో వైసీపీకి తొలి విజయం..! అక్కడ మారనున్న లెక్క..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో కొనసాగినా తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేతులు మారడంతో ఆ పార్టీ పరిస్ధితి పూర్దిగా తలకిందులైంది. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీలో కేవలం 11 సీట్లతో అతి బలహీన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా రాజకీయం చేయాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి భారీ ఊరటనిచ్చే విజయం ఒకటి ఇవాళ వరించింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నాయి.
రాష్ట్రంలో గతంలో విశాఖ స్ధానిక సంస్ధల కోటా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్నికలకు ముందు జనసేనలో చేరిపోయారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో విశాఖ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ సీటుకు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైసీపికి మాత్రం విశాఖ స్ధానిక సంస్ధల సీటులో భారీ మెజార్టీ ఉంది. దీంతో కూటమి పోటీ నుంచి తప్పుకుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి విశాఖ స్దానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధకారి ఇవాళ ప్రకటన చేశారు. బొత్సకు పోటీగా స్వతంత్ర అభ్యర్ధి షేక్ సఫీ నిలబడినా చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ నెల 30న జరగాల్సిన ఎన్నిక అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు బొత్సను మండలిలో విపక్ష నేతగా నియమించేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మండలిలో విపక్ష నేతగా ఎన్నికైన అప్పిరెడ్డి స్ధానంలో త్వరలో బొత్సను నియమించే అవకాశముంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications