ఎన్టీఆర్ మావాడే- వైసీపీ తాజా రాజకీయం- విగ్రహానికి పార్టీ రంగులు-భవిష్యత్ సంకేతాలు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆరి విషయంలో టీడీపీ గతంలో చేసిన తప్పిదాలను సాకుగా తీసుకుని ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో ఆయన విగ్రహానికి వైసీపీ రంగులేసి రెచ్చగొట్టే చర్యలకు దిగింది.

కృష్ణాజిల్లాలో వైసీపీ వర్సె,స్ టీడీపీ
ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను టీడీపీకి ఎలాగైనా దూరంం చేయాలని ఫిక్స్ అయిన వైసీపీ ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండుగా విభజించిన కృష్ణాజిల్లాలో విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దీన్ని కాదనలేని పరిస్దితుల్లో టీడీపీ కూడా సమర్ధించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా వైసీపీ మరో వ్యూహాత్మక రాజకీయానికి తెరలేపుతోంది.

ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
కృష్ణాజిల్లాలో టీడీపీతో హోగాహోరీ పోరాడుతూ ఇక్కడి కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ఇప్పుడు మరో చర్యకు దిగింది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు వూసింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ విగ్రహానికి అదీ ఆయన సొంత జిల్లాలోనే వైసీపీ రంగులు పూయడం ద్వారా వైసీపీ కవ్వింపు చర్యలకు దిగినట్లయింది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని విగ్రహానికి శుద్ధి చేసి తిరిగి పసుపు రంగు వేశారు.

మహానాడు వేళ మైండ్ గేమ్ ?
రేపటి నుంచి కృష్ణాజిల్లా అంగలూరులో టీడీపీ మినీ మహానాడు ప్రారంభం కానుంది. ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ భారీ ఎత్తున జనసమీకరణ కూడా చేస్తోంది. ఇదే క్రమంలో అన్న ఎన్టీఆర్ విగ్రహా దిమ్మెకు వైస్సార్ పార్టీ రంగులు వేయడం ద్వారా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగినట్లయింది.ఇదే మండలంలోని అంగలూరులో నిర్వహించనున్న మినీ మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. అలాగే ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు కూడా వెళ్లనున్నారు. దీంతో ఇప్పటికే నిమ్మకూరు ఎలా వస్తారని మంత్రి జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహానికి రంగులు పూయడం మైండ్ గేమ్ లో భాగమేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications