మల్టీస్టారర్ మూవీ..నాగబాబుకు మంత్రి పదవిపై అంబటి సెటైర్లు..!

ఏపీలో జనసేన తరఫున కీలకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కీలకంగా పనిచేసిన నాగబాబుకు ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంచి పదవి లభిస్తుందని అంతా ఆశించినా అలా జరగలేదు.

ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు కూడా వదులుకున్న నాగబాబుకు ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని, రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని ప్రచారాలు జరిగాయి. చివరికి తాజా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో మొండిచేయి ఎదురైంది. అదే సమయంలో కూటమి నుంచి రాజ్యసభ అభ్యర్ధుల పేర్లతో పాటు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామన్న ప్రకటన కూడా చంద్రబాబు చేశారు. దీంతో నాగబాబును త్వరలో కేబినెట్లోకి తీసుకోవడం ఖాయమైంది.

ysrcp leader Ambati Rambabu multi-starrer movie satire on minister post to konidela nagababu

ఏపీలో ఓటరు కూడా కాని నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. "ప్రభుత్వం అంటే మల్టీస్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం!" అని ట్విట్టర్ వేదికగా అంబటి సెటైర్ వేశారు. ఇందులో ఎక్కడా పవన్ పేరు కానీ, నాగబాబు పేరు కానీ పేర్కొనకపోయినా చంద్రబాబు తాజా ప్రకటన మీదే అంబటి ఈ సెటైర్ వేశారని తెలుస్తోంది. పవన్ ను ఎప్పటికప్పుడు టార్గెట్ చేసే అంబటి సెటైర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+