విజయవాడ లాజిక్ పిఠాపురానికి వర్తించదా ? పవన్ కు పోతిన మహేష్ సూటి ప్రశ్న..!

ఏపీలోని విజయవాడను తాజాగా బుడమేరు వరదలు ముంచెత్తాయి. వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహయక చర్యల్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా తిరుగుతున్నా డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ మాత్రం వెళ్లలేదు. ఇదే విషయంపై వైసీపీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ తాను వెళ్లే సహాయక చర్యలకు అడ్డంకి అని పవన్ తేల్చిచెప్పేశారు. అయితే నిన్న పిఠాపురంలో ఏలేరు వరద ప్రాంతాల్లో మాత్రం పవన్ పర్యటించారు. దీంతో వైసీపీ నేతలు ఆయన్ను మళ్లీ టార్గెట్ చేశారు.

విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్లకుండా తప్పించుకుని, పిఠాపురం వరద బాధితుల పరామర్శకు వెళ్లిన పవన్ ను వైసీపీ నేత పోతిన మహేష్ టార్గెట్ చేశారు. మీరు పిఠాపురానికి మంత్రా? లేక ఆంధ్ర ప్రదేశ్ కా? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. వరదలో ముంపులో తీవ్ర ఇబ్బందులు పడ్డ విజయవాడ నగర ప్రజలను గాలికి వదిలేసారని, విజయవాడ నగర ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? మీ క్యాంపు కార్యాలయం కూడా విజయవాడ నగరంలోనే ఉంది అంటూ గుర్తుచేశారు.

ysrcp leader Pothina Mahesh ask pawan kalyan about logic behind pithapuram visit than vijayawada

ఒకసారి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే.. నేను వస్తే జనాలు వస్తారు సహాయకు చర్యలకి ఆటంకం ఏర్పడుతుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటూ గతంలో పవన్ చెప్పిన మాటల్ని పోతిన మహేష్ గుర్తుచేశారు. కానీ పిఠాపురంకు వరదలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి బురదలో నడిచి ,బోటులో పర్యటన కూడా చేస్తారు ఇక్కడ ప్రజలు ఎవరూ మీ మీద పడలేదు సహాయకు చర్యలకు ఇబ్బంది రాలేదు అంటూ ఆక్షేపించారు.

బుడమేరు ముంపు వలన విజయవాడ నగరంలో లక్షల కుటుంబాలు రోడ్లు పాలైన, వందల వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన మీరు మాత్రం ఒక్క ప్రాంతాన్ని సందర్శించలేదు, ఒక్కరిని పరామర్శించలేదని పవన్ కళ్యాణ్ పై పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. విజయవాడ నగర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది అంటూ తన ట్వీట్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+