వైసీపీ నేతలకు ఎస్ఈసీ ఝలక్- సుప్రీం తీర్పు, ఎన్నికల బ్రేక్ తర్వాత మరో ట్విస్ట్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కూటమి పలు చోట్ల హింసాత్మక ఘటనలకు దిగి వైఎస్సార్సీపీ నామినేషన్లను అడ్డుకోవడం, వాటిపై ఫిర్యాదులు చేసినా ఎస్ఈసీ పట్టించుకోకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు నిన్న నామినేషన్ల గడువు పెంపుపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో పాటు అభ్యర్ధులకు తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాత్రికి రాత్రి మొత్తం 100 సీట్లలోనూ మున్సిపల్ ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

నామినేషన్లపై వైసీపీకి మరో గుడ్ న్యూస్..! ఎస్ఈసీ కీలక నిర్ణయం..!
నామినేషన్లపై వైసీపీకి మరో గుడ్ న్యూస్..! ఎస్ఈసీ కీలక నిర్ణయం..!

ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను (AP SEC) కలిసేందుకు వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు యథావిథిగా ప్రయత్నించారు. కానీ ఈసారి వారికి ఆపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో ఎస్ఈసీ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. విజ‌య‌వాడ‌ లోని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వ‌ద్ద వారు ధ‌ర్నాకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వస్తే.. అపాయింట్‌మెంట్ ఇవ్వక‌పోవ‌డం దారుణమని వారు తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తే కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలో అక్రమాలు, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు, గృహ నిర్బంధాలు జ‌రుగుతుంటే ఎస్ఈసీకి ఏమీ ప‌ట్ట‌డం లేదని నేతలు ఆరోపించారు. అభ్యర్థులపై దాడులు.. తలలు పగలగొట్టి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నా, ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదన్నారు.

YSRCP Leaders Protest Outside AP SEC Office After Failing to Secure Appointment Over Local Polls
మున్సిపల్ ఎన్నికల బ్రేక్ వెనుక ఏం జరిగింది ? ఎస్ఈసీ ప్రకటనకు ముందు, వెనుక..!
మున్సిపల్ ఎన్నికల బ్రేక్ వెనుక ఏం జరిగింది ? ఎస్ఈసీ ప్రకటనకు ముందు, వెనుక..!

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. నిన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. నేడు మళ్లీ అదే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల కమిషనర్‌ను కలవనివ్వకుండా జాయింట్ డైరెక్టర్‌ను కలవాలని చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుందని, అభ్యర్థులకు న్యాయం చేయడంలో జాప్యం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించిన నేతలు.. దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌, ఆధారాలను ఎస్ఈసీకి అందజేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా స్వామ్య బద్ధంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి అభ్యర్థికీ నామినేషన్ అవకాశం కల్పించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+