"దేశాన్ని నడపడమంటే అన్నీ అమ్మేయడమేనా ?"- మోడీ సర్కార్ కు కేతిరెడ్డి ప్రశ్న.!

గత కొన్నేళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కేంద్రంలో మోడీ సర్కార్ తో సఖ్యతగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ తాజాగా రూటు మారుస్తోంది. మోడీ సర్కార్ తో ఎంత సఖ్యతగా ఉన్నా గత ఎన్నికల్లో తమను కాదని కూటమికి మద్దతివ్వడంతో పాటు ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని తమను చిత్తుగా ఓడించారన్న ఆక్రోశం ఇప్పుడు ఆ పార్టీలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ లు చేస్తున్న నిరసనలకు సైతం మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ.. ఇప్పుడు దాన్ని మోడీ సర్కార్ కు విస్తరించింది.

రెచ్చిపోతున్న కేంద్రం-టీడీపీ, వైసీపీ చోద్యం.! సాయిరెడ్డి ఫైర్..!
రెచ్చిపోతున్న కేంద్రం-టీడీపీ, వైసీపీ చోద్యం.! సాయిరెడ్డి ఫైర్..!

కేంద్రంలో మోడీ సర్కార్ తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) ట్వీట్ చేశారు. అది ఐడీబీఐలో పెట్టుబడుల ఉపసంహరణ. ఐడీబీఐలో వాటాను విదేశీ సంస్థలకు అమ్మి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెచ్చామంటూ కేంద్రం చెప్పుకోవడాన్ని తప్పుబడుతూ కేతిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. మోడీ సర్కార్ నినాదమైన ఆత్మనిర్భర్ భారత్ ను సైతం సూటిగా ప్రశ్నిస్తూ తప్పుబట్టారు.

YSRCP s Kethireddy Questions Modi Government Over IDBI Bank Disinvestment and LIC s Stake

జగన్ కేసుల్లో మరో కీలక పరిణామం- ఈడీకి చంద్రబాబు అనుమతి..!
జగన్ కేసుల్లో మరో కీలక పరిణామం- ఈడీకి చంద్రబాబు అనుమతి..!

ముందు ఎయిర్ ఇండియా. తర్వాత పోర్టులు, ఎయిర్‌పోర్టులు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్, 60.72% విదేశీ సంస్థకు!
అందులో 30% వాటా ఎల్ఐసీది, అంటే సామాన్యుడి బీమా డబ్బు! రేపు ఏంటి? "ఆత్మనిర్భర్ భారత్" అంటే అమ్మకాల భారతా? దేశాన్ని నడపడం అంటే, ఒక్కొక్కటి అమ్ముకుంటూ పోవడమా? అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మోడీ సర్కార్ పై వరుస ప్రశ్నలు గుప్పించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపడుతున్న పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకాలను నిలదీశారు. అయితే ఈ ట్వీట్ వైసీపీ విధాన నిర్ణయంలో భాగంగా కేతిరెడ్డి పెట్టారా లేక ఆయన వ్యక్తిగతంగా పెట్టారో తెలియలేదు. ఇప్పటికే కాక్రోచ్ లకు మద్దతుగా జగన్ చేసిన ట్వీట్ కు వారు ధన్యవాదాలు తెలిపాక బీజేపీ నేతలు వైసీపీని వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర విధానాలను తప్పుబడుతూ వైసీపీ దూకుడుగా ముందుకెళ్తే ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+