AP Pensions: ఏపీలో పెన్షన్ల రాజకీయం..! ఈసీ ఆదేశంపై వైసీపీ వర్సెస్ టీడీపీ..!

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయానికి మరోసారి వాలంటీర్లు కేంద్రబిందువుగా మారిపోయారు. వాలంటీర్లతో ఎలాంటి పనులూ చేయించవద్దని ఈసీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెప్పేసింది. అయితే తాజాగా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నాలను టీడీపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో దానికీ బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు టీడీపీ వల్లే ఠంచనుగా ఒకటో తేదీన అందాల్సిన పెన్షన్లు అందడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సర్కార్ పెన్షన్లు ఆలస్యం చేస్తోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.

ఆర్బీఐ సెలవు, ఇతర కారణాలతో ఈ నెల పెన్షన్లు 3వతేదీన అందుతాయని ప్రభుత్వం వారం క్రితమే ప్రకటించింది. ఈ లెక్కన 3వ తేదీన వాలంటీర్లతో పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఇప్పటికే వాలంటీర్లు వైసీపీ అభ్యర్ధుల ప్రచారంలో కీలకంగా వ్యవహరించి సస్పెండ్ అవుతున్న క్రమంలో వారిని పెన్షన్ల పంపిణీలో కూడా వాడొద్దంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్ధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దీనిపై స్పందించిన హైకోర్టు ఈసీకి ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశాలు ఇచ్చేసింది.

ysrcp versus tdp verbal war over cec orders on volunteers caused ysr asara pensions delay

ఇక్కడి నుంచి అసలు రాజకీయం మొదలైంది. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించవద్దని ఈసీ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇవ్వగానే టీడీపీ ఫిర్యాదులతోనే పెన్షన్లు ఆగిపోయాయన్న ప్రచారం వైసీపీ మొదలుపెట్టేసింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ కారణంగానే హైకోర్టు ఈసీకి ఆదేశాలు ఇచ్చిందని, దీంతో ఈసీ కూడా వాలంటీర్లపై ఆదేశాలు ఇచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది.

దీనికి కౌంటర్ గా టీడీపీ పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దని సీఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని, దాన్ని ప్రభుత్వం అమలు చేయకుండా వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి ప్రయత్నించడం వల్ల తాము ఫిర్యాదు చేశామని, దీనిపై ఈసీ స్పందించి ఆదేశాలు ఇచ్చిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. అలాగే పెన్షన్లు ఈసారి ఆలస్యంగా ఇవ్వాలని ప్రభుత్వమే గత నెలలో నిర్ణయం తీసుకుందని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం నిజంగా ఏప్రిల్1న పెన్షన్లు ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బందిని ఇళ్లకు పంపి ఇప్పించేదని, కానీ ఆ ఉద్దేశం లేకపోవడం వల్లే ఇలా టీడీపీపై నిందలు మోపేందుకు దీన్ని వాడుకుంటోందని కౌంటర్లు ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+