భార్య కోసం కొబ్బరి చెట్టెక్కి ఓ భర్త హంగామా: భర్త డిమాండ్ తెలిస్తే షాక్ అవుతారు
ఎక్కడైనా భర్తల కోసం భార్యలు పోరాటం చేయడం తెలిసిందే . తమను తమ భర్తతో కలపాలని భర్త ఇంటిముందు భీష్మించుకు కూర్చునే భార్యలను ఎందరినో చూస్తుంటా. ఇక భార్య మెప్పుకోసం చీరలు, నగలు కొనిచ్చి ఆమెను ఆకాశానికెత్తేసిన భర్తల గురించి వినే ఉంటాం. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఒక భర్త భార్య కోసం చేసిన పని అందరినీ నవ్వుకునేలా చేసింది. ఇంతకీ అతను ఏం చేసాడంటే
Recommended Video


భార్య కోసం కొబ్బరి చెట్టెక్కిన భర్త ... 8 గంటలు హంగామా
కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాలో దొడ్డప్ప అనే 40 ఏళ్ల వయసున్న వ్యక్తి భార్య కోసం కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. దాదాపు ఎనిమిది గంటలపాటు కొబ్బరి చెట్టు పైన కూర్చుని నానా హంగామా చేశాడు. ఏదో మామూలుగా చెట్టెక్కాడు అనుకున్న అక్కడి వారందరూ, చెట్టుపై నుండి దిగకుండా అతడు చేస్తున్న హంగామా చూసి ఏం జరిగింది అని ప్రశ్నించారు . దీంతో ఆ వ్యక్తి తనను తన భార్యను ఒకటి చేయడంలో మీరంతా విఫలమయ్యారు అంటూ ఊరి జనం పై వీరంగం వేసాడు.

తనను , తన భార్యను కలపాలని గ్రామస్తులకు డిమాండ్ ..
అంతేకాదు తనను కాదని వెళ్లిపోయిన తన భార్యతో తనను కలపాలని గ్రామస్తులందరిని డిమాండ్ చేశాడు. లేదంటే చెట్టు పైనుండి కిందికి దూకేస్తానంటూ బెదిరించాడు.దొడ్డప్పకు అతని భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఐదేళ్ల క్రితం దొడ్డప్ప భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది . భార్య లేకుండా ఇంటిని, ముగ్గురు కొడుకుల్ని చూసుకోవడం తన వల్ల కావడం లేదని చెట్టెక్కి కూర్చున్నచోట, తనను తన భార్యను కలపాల్సిన బాధ్యత ఊరి జనాలదేనని తేల్చిచెప్పాడు.

భార్యతో కలపకుంటే చెట్టుపై నుండి దూకి చస్తానని బెదిరింపు
తన భార్యను తీసుకు రాకుంటే చెట్టుపై నుంచి దూకి చస్తాను అంటూ బెదిరించాడు. ఇక ఊరి జనం చూస్తూ చూస్తూ ఒక ప్రాణం పోవడం ఇష్టం లేక దొడ్డప్ప భార్యతో ఎలాగోలా మాట్లాడి, సర్దిచెప్పి ఇద్దరిని కలుపు తామని హామీ ఇవ్వడంతో దొడ్డప్ప చెట్టు దిగి వచ్చాడు. ఎక్కడైనా భార్య, భర్తను కాదని వెళ్లిపోతే భర్త వెళ్లి భార్యకు సర్దిచెప్పి తీసుకోవాలి గానీ, చెట్టెక్కి కూర్చొని ఊరి జనాలకి బాధ్యత అని చెప్పడం అందరు విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడా భార్యాభర్తలిద్దరినీ కలపడానికి ఆ ఊరి గ్రామస్తులందరూ నడుం బిగించాల్సిందే . ఒకవేళ ఆ పని జరగలేదంటే మళ్లీ మనోడు చెట్టెక్కి కూర్చున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications