ఎర్రతోలు ఆంటీతో అక్రమ సంబంధం, లక్షల్లో డబ్బులు, నగలు, ఆస్తులు హుష్ కాకి,చివరికి!
బెంగళూరు/కొడుగు: అతను అందమైన యువకుడు. మేడమ్ కూడా ఎర్రతోలు వేసుకుని చాలా అందంగా ఉంటుంది. ఆ అందమైన మహిళ ఆ యువకుడిని ఆకర్షించింది. ఆమె ప్రేమ వలలో పడిన ఆ యువకుడు వీధిన పడ్డాడు. అతని ప్రాణం పోయిన తర్వాత అతని జేబులో ఉన్న లేఖ అతని ఆత్మహత్య రహస్యాన్ని బయటకు వచ్చేలా చేసింది. ఆ యువకుడు ప్రేమించేది యువతిని కాదు అని ఓ బిడ్డ తల్లి అయిన ఆంటీని అని తెలిసి అందరూ షాక్ అయ్యారు.
కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా హాటూరు గ్రామానికి చెందిన సరోజ కుమారుడు అజిత్ గణపతి అనే యువకుడు ఓ ఆంటీని ప్రేమించి రూ. 10 లక్షలకు పైగా డబ్బుతో పాటు, ఆస్తి, బంగారు నగలు పోగొట్టుకున్నాడు. సరోజకి చిన్న కొడుకు అజిత్. అజిత్ అంటే అతని తల్లి సరోజాకు చాలా ఇష్టం. గోనికొప్పల్‌లో ప్రైవేట్ బస్సు ఓనర్ అయిన అజిత్ నాలుగేళ్లుగా గోనికొప్పల్ నుంచి హుడికేరి, బీరునాని, శ్రీమంగళ ప్రాంతాలకు బస్సు నడుపుతున్నాడు.

అజిత్ గణపతి జూలై 2వ తేదీ రాత్రి అకస్మాత్తుగా గోనికొప్ప మార్కెట్ సమీపంలో విషం తాగేశాడు. అజిత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన అతని సోదరుడు భరత్ సోమయ్య నన్ను రక్షించవద్దు. నేను బతికినా రేపు ఆంటీ మొగుడు కిరణ్ గౌడ్ నన్ను చంపేస్తాడేమోనని భయంగా ఉందని ఆవేదన చెందాడు.
అజిత్‌ను మైసూరు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక అజిత్ మృతి చెందాడు. అజిత్ గణపతి హఠాత్తుగా విషం తాగి చనిపోవడానికి కారణం ఏమిటని అతని బంధువులు హడలిపోయారు. అజిత్ రాసి జేబులో పెట్టుకున్న డెత్ నోట్ అందరి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అప్పుడు కూడా అజిత్ గణపతి చనిపోతాడని తెలుసు. కానీ కిరణ్ గౌడ్ చంపేస్తాడనే నిజం బయటపడింది. అంతే కాదు అజిత్ గణపతి ఓ మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది.
నాలుగేళ్లుగా గోనికొప్పల్ నుంచి హుడికేరి, బీరునాని, శ్రీమంగళ ప్రాంతాలకు బస్సు నడుపుతున్నాడు. బీరునాని సమీపంలోని పూకోల గ్రామానికి చెందిన బిన్యా బోజమ్మ అలియాస్ బిన్యా అనే మహిళ ఈ మార్గంలో సంచరిస్తూ అజిత్ కు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరువాత అజిత్ నువ్వు లేకుంటే నేను లేను అంటూ బిన్యా అతన్ని ముగ్గులోకి దించింది.

అజిత్ అతను కష్టపడి సంపాదించినదంతా ఆమెకు ఇవ్వడం ప్రారంభించాడే. ఇంటికి వచ్చినా ఎవరితోనూ సంభాషించని అజిత్ . పనిచేసినా, బస్సు నడుపుతున్నా ఇంటికి డబ్బులు ఇవ్వలేదు. చేసిన పనికి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారం, ఆస్తుల పత్రాలను తాకట్టు పెట్టి అతని ప్రియురాలు బిన్యా ఆంటీకి డబ్బులు ఇచ్చేవాడని అజిత్ సోదరుడు చెప్పాడు.
అజిత్ కొన్ని సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఉన్న సమయంలో కొనుగోలు చేసిన కారును తాజాగా విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును ఏం చేశారో తెలియలేదు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి సామాన్లు తీసుకెళ్లి తాకట్టులో పెట్టాడని తెలిసింది. స్నేహితుడి దగ్గర రూ. 50 వేలు, బంధువుల వద్ద లక్షల్లో డబ్బులు అప్పు తీసుకున్న అజిత్ అతని ప్రియురాలు బిన్యా ఆంటీకి ఇచ్చేశాడు.
ఇటీవలనే అజిత్ అతని విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మేశాడు. తరువాత బిన్యా ఆంటీ తనకు ఇంకా డబ్బులు కావాలని అజిత్ ను వేధించింది. ఇదే సమయంతో తన భార్య బిన్యాతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా, నిన్ను చంపేస్తాను అంటూ బిన్యా భర్త కిరణ్ గౌడ అజిత్ ను బెదిరింపులకు గురి చేశాడు.
చేతిలో డబ్బులు లేకపోవడం, తాను ప్రేమించిందిన ఆంటీని అని తెలుసుకున్న అజిత్ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బిన్యా ఆంటీ, ఆమె భర్త కిరణ్ గౌడను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కొడుగు పోలీసులు తెలిపారు. వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసిన యువకుడు చివరికి సర్వం పొగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications