Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM PA: నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? ఎవరు చెప్పారు ?, సీఎం పీఏ రివర్స్ గేర్, ఆ రోజు ఇది జరిగింది !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపొలిటికల్ పీఏ ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. నాలుగు రోజుల నుంచి బెంగళూరులోని ఎమ్ఎస్. రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మీరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు ? మీ సమస్య ఏమిటి ? అని ప్రశ్నించిన మీడియాకు ఆయన చెప్పిన సమాధానంతో దిమ్మతిరిగిపోయింది. నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? మీకు ఎవరు చెప్పారు ?, నేను ఏమైనా అంత పిరికివాడినా ? అంటూ సంతోష్ మీడియాను ప్రశ్నించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సంతోష్ చెప్పిన సమాధానంతో మీడియాతో పాటు కన్నడ ప్రజలు షాక్ కు గురైనారు.

 సీఎం పీఏ+ సమీప బంధువు

సీఎం పీఏ+ సమీప బంధువు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శిగా ఎన్ఆర్. సంతోష్ పని చేస్తున్నారు. రాజకీయ కార్యదర్శిగానే కాకుండా సీఎం బీఎస్. యడియూరప్పకు సంతోష్ చాలా సన్నిహితుడు, నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్ఆర్. సంతోష్ ఎవరో కాదు. సీఎం బీఎస్. యడియూరప్పకు అక్క మనుమడు ఈ సంతోష్. బీఇ పూర్తి చేసిన సంతోష్ తరువాత బీఎస్. యడియూరప్పరు రాజకీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నాడు.

 రాత్రి ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే 1

రాత్రి ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే 1

గత శుక్రవారం రాత్రి బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని సొంత ఇంటికి వెళ్లిన సంతోష్ తరువాత ఇంట్లో నిద్రమాత్రలు మింగేసిన ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ భార్య జాహ్నవి వెళ్లి భర్తను పలకరించగా అతను అపస్మారకస్థితిలో పడి ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి తరలించడం కలకలం రేపింది.

 సీఎంకు, బీజేపీ నాయకులకు షాక్

సీఎంకు, బీజేపీ నాయకులకు షాక్

తన రాజకీయ కార్యదర్శి, సమీప బంధువు ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం చేశాడని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సమాచారం అందింది. వెంటనే అదే రోజు అర్దరాత్రి సీఎం బీఎస్. యడియూరప్ప ఎంఎస్. రామయ్య ఆసుపత్రికి పరుగు తీశారు. సంతోష్ ఆరోగ్యం గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో బీఎస్. యడియూరప్ప సంతోష్ భార్య జాహ్నవికి ధైర్యం చెప్పారు. తరువాత అసలు ఏం జరిగింది అంటూ సీఎం యడియూరప్ప సంతోష్ సన్నిహితుల నుంచి ఆరా తీశారు.

 ఆ రోజు సీఎం ఏం చెప్పారు ?

ఆ రోజు సీఎం ఏం చెప్పారు ?

శుక్రవారం ఉదయం తనతో పాటు తన పీఏ సంతోష్ సుమారు 45 నిమిషాల పాటు సంతోషంగా, ఉల్లాసంగా మాట్లాడుతూ వాకింగ్ చేశాడని సీఎం బీఎస్. యడియూరప్ప మరుసటి రోజు (శనివారం) మీడియాకు చెప్పారు. వాకింగ్ చేసిన తరువాత కొన్ని రాజకీయ విషయాలపై తనతో చర్చించాడని, తరువాత ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదని సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. సంతోష్ ఇంట్లో 12 నిద్రమాత్రలు మింగేశారని శుక్రవారం నుంచి జోరుగా ప్రచారం జరగడంతో ఆయన మీద బెంగళూరు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

 భార్య చెప్పింది నిజం కాదా ?

భార్య చెప్పింది నిజం కాదా ?

రాష్ట్ర రాజకీయాల విషయంలో కొన్ని రోజుల నుంచి తన భర్త సంతోష్ చాలా టెన్షన్ పడుతున్నాడని అతని భార్య జాహ్నవి ఆ రోజు అన్నారు. ఉదయం బయటకు వెళ్లిన తన భర్త సంతోష్ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి అతని గదిలోకి వెళ్లాడని. భోజనం చెయ్యాలని పిలవడానికి వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, మాకు కుటుంబ సమస్యలు ఏమీ లేవని సంతోష్ భార్య జాహ్నవి క్లారిటీ ఇచ్చింది. అయితే సంతోష్ భార్య ఆ రోజు చెప్పింది నిజం కాదని వెలుగు చూసింది. ఇటీవల కాలంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి సంతోష్ మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు.

 ఆత్మహత్యాయత్నం ఎవరు చేశారు ?

ఆత్మహత్యాయత్నం ఎవరు చేశారు ?

సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన సంతోష్ మీడియాతో మాట్లాడుతూ తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. మూడు రోజుల క్రితం తాను ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ భోజనం చెయ్యడంతో నకు ఫుడ్ ఇన్ ఫెక్షన్ అయ్యిందని, అందువలన అనారోగ్యానికి గురైనానని, ఆ మాత్రలకు బదులు వేరే మాత్రలు తీసుకోవడం వలన ఇలా జరిగిందని సంతోష్ చెప్పడంతో అక్కడ ఉన్న మీడియా మిత్రులు షాక్ అయ్యారు.

 నేను అంత పిరికివాడు కాదు ఫ్రెండ్స్

నేను అంత పిరికివాడు కాదు ఫ్రెండ్స్

నేను ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు, ఇప్పుడు నా ఆరోగ్యం కుదటపడింది, నేను ఆత్మహత్యాయత్నం చెయ్యలేదు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప రాజకీయ కార్యదర్శి, ఆయన సమీప బంధువు సంతోష్ వివరణ ఇచ్చారు. మొత్తం మీద సీఎం పీఏ సంతోష్ ఆత్మహత్యాయత్నం చెయ్యలేదని ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో చాలా మంది షాక్ కు గురైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+