EX lover: కొత్త పెళ్లికూతురిని ఇంట్లో వదిలి వెళ్లిన భర్త, మాజీ ప్రియుడు ఎంట్రీ, నాకే హ్యాండ్ ఇస్తావా అని?!

బెంగళూరు/దేవనహళ్ళి: ఒకే ఊరిలో యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తరువాత ప్రేమించుకున్నారు. ప్రతిరోజు ఉద్యోగానికి బైక్ లో వెళ్లి వస్తున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని ప్రియురాలు ఆమె ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న రెండు వారాలు భర్త ఇంట్లో ఉంది. ఉదయం కొత్త పెళ్లి కూతురిని ఆమె పుట్టింటి దగ్గర భర్త వదిలి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి మాజీ ప్రియుడు నన్ను మోసం చేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ కొత్త పెళ్లికూతురిని కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు విషం తాగేశాడు.

ఒకే ఊరిలో నివాసం

ఒకే ఊరిలో నివాసం

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్ళి సమీపంలోని అవతి గ్రామంలో సౌమ్యా (23) అనే యువతి, సుబ్రమణ్య (26) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. సౌమ్యా, సుబ్రమణ్య చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సౌమ్యా, సుబ్రమణ్య కులాలు కూడా ఒక్కటే కావడంతో వాళ్లు స్నేహితులు అని గ్రామస్తులు అనుకున్నారు.

బెంగళూరులో ఉద్యోగం..... లవర్స్

బెంగళూరులో ఉద్యోగం..... లవర్స్

బెంగళూరులోని నాగవారలోని కాఫీడేలో సుబ్రమణ్య ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత సౌమ్యా కూడా అదే కాఫీడేలో ఉద్యోగంలో చేరింది. ప్రతినిత్యం సుబ్రమణ్య బైక్ లోనే సౌమ్యా కూడా ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. మూడు సంవత్సరాల క్రితం సుబ్రమణ్య, సౌమ్యా ప్రేమలో పడ్డారు. రోజు బైక్ లో తిరుగుతున్న ప్రేమికులు ఎంజాయ్ చేశారు.

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి వేరే అబ్బాయితో పెళ్లి

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి వేరే అబ్బాయితో పెళ్లి

ప్రియుడు సుబ్రమణ్యతో హ్యాపీగా తిరుగుతున్న సౌమ్యా అతనితో సంతోషంగానే ఉంది. అయితే ప్రియుడు సుబ్రమణ్యకు హ్యాండ్ ఇచ్చిన సౌమ్యా బెంగళూరులో నివాసం ఉంటున్న మరో యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. తనను పెళ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని సుబ్రమణ్య అతని ప్రియురాలు సౌమ్యాకు ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు.

15 రోజుల క్రితం పెళ్లి

15 రోజుల క్రితం పెళ్లి

ప్రియుడు సుబ్రమణ్య ఎంత చెప్పినా అతని ప్రియురాలు సౌమ్యా మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతకాలం తిరిగాము, ఎంజాయ్ చేశాము, ఇక చాలు అని తేల్చి చెప్పింది. 15 రోజుల క్రితం బెంగళూరు యువకుడితో సౌమ్యా పెళ్లి జరిగిపోయింది. వివాహం చేసుకున్న రెండు వారాలు సౌమ్యా బెంగళూరులోని ఆమె భర్త ఇంట్లో ఉంది.

ప్రియురాలిని పొడిచి చంపేసిన మాజీ ప్రియుడు

ప్రియురాలిని పొడిచి చంపేసిన మాజీ ప్రియుడు

గురువారం ఉదయం కొత్త పెళ్లి కూతురు సౌమ్యాను ఆమె పుట్టింటి దగ్గర వదిలిపెట్టిన ఆమె భర్త తరువాత బెంగళూరు వెళ్లిపోయాడు. తన మాజీ ప్రియురాలు సౌమ్యా ఇంటికి వచ్చిందని సుబ్రమణ్యకు తెలిసింది. అదే రోజు రాత్రి మాజీ ప్రియుడు సుబ్రమణ్య సౌమ్యా ఇంటికి వెళ్లాడు. నన్ను మోసం చేసి వేరేవాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ కొత్త పెళ్లికూతురు సౌమ్యాను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

విషం తాగేసిన ప్రియుడు

విషం తాగేసిన ప్రియుడు

సౌమ్యా గట్టిగా కేకలు వెయ్యడంతో సుబ్రమణ్య అక్కడి నుంచి తప్పించుకునిపారిపోయాడు. సౌమ్యాను మూడు ఆసుపత్రులు తిప్పి చికిత్సఅందించారు. అయితే చికిత్స విఫలమై సౌమ్యా చనిపోయింది. ప్రియురాలు సౌమ్యాను హత్య చేసిన సుబ్రమణ్య నిర్జనప్రదేశంలోకి వెళ్లి విషం తాగేసి అతని అన్నకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు. కుటుంబ సభ్యులు సుబ్రమణ్యను ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు సౌమ్యాను హత్య చేసిన సుబ్రమణ్య ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బతికిబయటపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+