Powerful SI: ఎస్ఐ పేరుతో నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్, 50 మంది మహిళలను?, 1 లక్ష మంది ఫాలోవర్స్!

ఎస్ఐ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు 1 లక్షా 20 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది నా బాధ్యతగా బావిస్తున్నాను అంటూ సినిమా స్క్రిప్ట్ టైప్ లో కొన్ని క్యాప్షన్స్ పోస్టు చేశారు.

బెంగళూరు/బెళగావి: పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తికి ఆ జిల్లాలో ఇంతో అంతో పేరు ఉంది. ఎస్ఐకి చాలా మంది గౌరవం ఇస్తున్నారు. అలాంటి ఎస్ఐ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఓ అకౌంట్ ప్రారంభించారు. ఎస్ఐ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు 1 లక్షా 20 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది నా బాధ్యతగా బావిస్తున్నాను అంటూ సినిమా స్క్రిప్ట్ టైప్ లో కొన్ని క్యాప్షన్స్ పోస్టు చేశారు. ఎస్ఐ పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తో 50 మంది మహిళలను మోసం చేశారు. చివరికి తెలిసింది ఎస్ఐ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో నకిలి అకౌంట్ ప్రారంభించారని. నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ మ్యాటర్ తెలుసుకున్న అసలైన ఎస్ఐ ఎంట్రీ ఇచ్చాడు.

ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి

ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని నిప్పాణి రూరల్ పోలీస్ స్టేషన్ లో అనీల్ కుమార్ కంబార్ అలియాస్ అనీల్ కుమార్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. నిప్పాణితో పాటు బెళగావిలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన అనీల్ కుమార్ మంచి పేరు సంపాధించుకున్నారు. ఎస్ఐ అనీల్ కుమార్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఓ నకిలీ అకౌంట్ ప్రారంభించారు.

50 మంది మహిళలతో?

50 మంది మహిళలతో?

ఎస్ఐ అనీల్ కుమార్ పేరుతో ఉన్న నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు 1.20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నకిలి అకౌంట్ తోనే 50 మంది మహిళలను ఓ యువకుడు మోసం చేసి భారీగా డబ్బులు లాక్కొని వారిలో కొంత మందితో కేటుగాడు కోరికలు తీర్చుకుని జల్సాలు చెయ్యడం మొదలుపెట్టాడు. ఎస్ఐ అనీల్ కుమార్ పేరుతో వేరే వ్యక్తులు మోసం చెయ్యడానికి అవకాశం లేదని అనుకున్న మహిళలు, యువతులు అతని చేతిలో మోసపోయారు.

విజయ్ అరెస్టు

విజయ్ అరెస్టు

ఎస్‌ఐ అనీల్ కుమార్ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అనేక మంది మహిళలను మోసం చేశారని ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళలను ప్రలోభపెట్టి రూ. 4 లక్షలకు పైగా వారి నుంచి వసూలు చేసిన విజయ్ కుమార్ బరాలీ అలియాస్ విజయ్ అనే నిందితుడిని బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ కుమార్ బరాలీ అనే నిందితుడు నిప్పాణి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అనిల్ కుమార్ కంబార్ పేరిట నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడని పోలీసులు తెలిపారు.

భలే మేనేజ్ చేశాడు.... 9 నకిలి అకౌంట్లు

భలే మేనేజ్ చేశాడు.... 9 నకిలి అకౌంట్లు

ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో 1.20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిందితుడు విజయ కుమార్ బరాలీ వద్ద ఇలాంటి 9 నకిలీ ఐడీ ఖాతాలు ఉన్నాయని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి పలువురుని కొందరు మోసం చేస్తున్నారని, తనకు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నించారని నిప్పాణి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అనీల్‌ కుమార్‌ కంబార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా

అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా

నిందితుడి విజయ్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బెళగావి పోలీసుల రహస్య ఆపరేషన్‌లో విజయ్ చిక్కిపోయాడు. కర్ణాటకలోని అథణి ప్రాంతానికి చెందిన విజయ్ నిప్పాణి రూరల్ ఎస్‌ఐ అనీల్ కుమార్ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నాడని బెళగావి సిటీ పోలీసులు తెలిపారు.

కుష్కా, షార్వా, కుర్మా ఒకేసారి తినిపిస్తున్నారు

కుష్కా, షార్వా, కుర్మా ఒకేసారి తినిపిస్తున్నారు

ఇప్పటికే 50 మందికి పైగా మహిళల నుంచి 4 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసి వారికి పంగనామాలు పెట్టాడని, వీడు ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని బెళగావి పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఓ ఎస్ఐ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో నకిలి అకౌంట్ ప్రారంభించి మహిళలను మోసం చేశారని వెలుగు చూడటంతో పోలీసు శాఖ అధికారులు షాక్ అయ్యారు. దెబ్బకు విజయ్ కి కుష్కా, కుర్మా కలిపి తినిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+