Girlfriend: అందమైన అత్త కూతురి కోసం ఏంచేశాడంటే ?, ఫుల్ ఎంజాయ్, క్లైమాక్స్ లో సీసీటీవీల్లో, షాక్!
బెంగళూరు: సొంత మామ, అత్తల కూతురు అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు అనున్నాడు. మామ కూతురితో జీవితాంతం సుఖంగా ఉండాలని ఆ యువకుడు ఆశపడ్డాడు. ఉద్యోగం చేస్తున్న యువకుడు పెళ్లికి ముందే అత్తకూతురితో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేశాడు. సంపాధిస్తున్న జీతంతో అత్త కూతురితో అతను అనుకున్నట్లు ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది .
అంతే అత్త కూతురితో విలాసవంతమైన జీవితం గడపడానికి కేటుగాడు తెలిసిన వాళ్లను టార్గెట్ చేసుకున్నాడు. అనుకున్నట్లు పనులు పూర్తి చేస్తున్న యువకుడు ఇంతకాలం తప్పించుకుని తిరిగాడు .అయితే పరిస్థితులు అనుకూలించకపొవడంతో సీసీటీవీల్లో మనోడి అసలు మ్యాటర్ బయటకు రావడంతో ఇప్పుడు జైలుపాలైనాడు.

అందమైన అత్త కూతురి మీద ఆశ
బెంగళూరు నగరంలోని కేపీ అగ్రహారలో నవీన్ కుమార్ అలియాస్ నవీన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సొంత మామ, అత్తల కూతురు అందంగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నవీన్ కుమార్ చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు. మామ కూతురితో జీవితాంతం సుఖంగా ఉండాలని నవీన్ కుమార్ ఆశపడ్డాడు.

జయనగర్ లో ఉద్యోగం
జయనగర్ లోని ఫేమస్ కేఫ్ లో ఉద్యోగం చేస్తున్న నవీన్ కుమార్ పెళ్లికి ముందే అత్తకూతురితో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేశాడు. సంపాధిస్తున్న జీతంతో అత్త కూతురితో నవీన్ కుమార్ అనుకున్నట్లు ఎంజాయ్ చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది. మంచి ఉద్యోగం చిక్కడం కష్టంగా ఉందని, డబ్బులు ఎలా సంపాధించాలని నవీన్ కుమార్ ఆలోచించాడు.

పక్కింటి వాళ్లతో పరిచయం
నవీన్ కుమార్ పని చేస్తున్న కేఫ్ పక్కనే శివశంకరయ్య అనే వ్యక్తి ఆయన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు కేఫ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న నవీన్ కుమార్ పక్కింటిలో నివాసం ఉంటున్న శివశంకరయ్య, ఆయన భార్యతో పరిచయం పెంచుకున్నాడు. అప్పడప్పుడు శివశంకరయ్య ఇంటికి వెళ్లి వస్తున్న నవీన్ కుమార్ వాళ్లకు ఏమైనా అవసరం ఉంటే వాటిని తీసుకెళ్లి ఇస్తున్నాడు.

నగలు మాయం చేసి అత్త కూతురితో ఎంజాయ్
అత్త కూతురితో విలాసవంతమైన జీవితం గడపడానికి నవీన్ కుమార్ పక్కనే నివాసం ఉంటూ పరిచయం ఉన్న శివశంకరయ్య ఫ్యామిలీని వాళ్లను టార్గెట్ చేసుకున్నాడు. మార్చి నెలలో అనుకున్నట్లు శివశంకరయ్య ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న రూ. 5 లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేసిన నవీన్ కుమార్ అక్కడి నుంచి మాయం అయ్యాడు.

సీసీటీవీల్లో మ్యాటర్ లీక్
ఇంట్లో బంగారు నగలు చోరీ అయిన విషయం శివశంకరయ్య, ఆయన భార్య అంత త్వరగా గుర్తించలేదు. ఇటీవల ఏదో పని కోసం బీరువా తీస్తే అందులో బంగారు నగలు మాయం అయిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఇంటికి అప్పుడప్పుడు నవీన్ కుమార్ వచ్చి వెలుతున్నాడని శివశంకరయ్య పోలీసులకు చెప్పారు.
శివశంకరయ్య ఇంట్లో బంగారు నగలు లూటీ చేసిన నవీన్ కుమార్ ఇంతకాలం తప్పించుకుని తిరిగాడు .అయితే పరిస్థితులు అనుకూలించకపొవడంతో సీసీటీవీల్లో నవీన్ కుమార్ నగలు ఎప్పుడు లూటీ చేశాడు అనే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. అత్త కూతురితో ఎంజాయ్ చెయ్యాలని బంగారు నగలు లూటీ చేసిన నవీన్ కుమార్ ఇప్పుడు జైలుపాలైనాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications