Girlfriend: ప్రభుత్వ అకౌంట్ లోని లక్షల రూపాయల డబ్బులు గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ లో డిపాజిట్ చేసి?!
బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి లక్షణంగా పెళ్లి చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న అతను అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్నాడు. సిటీ కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తున్న అతను కాంట్రాక్టర్లు డిపాజిట్లు, వారి బిల్లులు చెల్లించే పనులు చూస్తున్నాడు. కార్పోరేషన్ విభాగంలో పని చేస్తున్న ఆ ఉద్యోగి నిత్యం లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు చూసుకుంటున్నాడు.
ఇటీవల ఆడిటింగ్ అధికారుల పరిశీలనలో లక్షల్లో గోల్ మాల్ అయ్యిందని వెలుగు చూసింది. బ్యాంక్ స్టేట్ మెంట్ పరిశీలించిన అధికారులు షాక్ అయ్యారు. కార్పోరేషన్ కు చెందిన అధికారిక బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ కావలసిన లక్ష్లల రూపాయల నగదు ఓ బ్యూటీషియన్ కు చెందిన అకౌంట్ లో జమ అయ్యిందని గుర్తించిన అధికారులు బిత్తరపోయారు.

బీబీఎంపీలో ఉద్యోగం
బెంగళూరులోని బీబీఎంపీ యలహంక ఉప విభాగంలోని బ్యాటరాయణపురలోని కార్పోరేషన్ కార్యాలయంలో ధణిసంద్రలోని ఏకే కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్ (39) ఉద్యోగం చేస్తున్నాడు. కార్పోరేషన్ కార్యాలయంలో ఎస్ డీఏగా ఉద్యోగం చేస్తున్న ప్రకాష్ ఇంతకాలం చాలా నమ్మకంగా ఉంటూ పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు.

అధికారుల దగ్గర నమ్మకం సంపాధించాడు
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రకాష్ లక్షణంగా పెళ్లి చేసుకుని ధణిసంద్రలో నివాసం ఉంటూ అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. ప్రతిరోజు బ్యాటరాయణపురలోని కార్పోరేషన్ కార్యాలయంలో ఉద్యోగానికి వెళ్లి వస్తున్న ప్రకాష్ అకౌంట్స్ విభాగంలో సీనియర్ అధికారుల దగ్గర పని చేస్తున్నాడు.

రూ. లక్షలు, రూ. కోట్లలో డిపాజిట్లు
బీబీఎంపీలో ఉద్యోగం చేస్తున్న ప్రకాష్ అతను కాంట్రాక్టర్లు డిపాజిట్లు, వారి బిల్లులు చెల్లించే పనులు చూస్తున్నాడు. ఇటీవల ఆడిటింగ్ అధికారుల పరిశీలనలో లక్షల్లో గోల్ మాల్ అయ్యిందని వెలుగు చూసింది. అదే సందర్బంలో ప్రకాష్ సెలవు పెట్టి పై అధికారుల చేతికి చిక్కకుండా వెళ్లిపోయాడు. బ్యాంక్ స్టేట్ మెంట్ తీసుకున్న అకౌంట్స్ విభాగం అధికారులు లెక్కలు పరిశీలించి షాక్ అయ్యారు.

బ్యూటీషియన్ ప్రియురాలు
బీబీఎంపీ కార్యాలయం బ్యాంకు అకౌంట్ లో డిపాజిట్ కావలసిన రూ. 14. 07 లక్ష్లల రూపాయల నగదు యలహంకలో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ కాంచనాకు చెందిన అకౌంట్ లో జమ అయ్యిందని గుర్తించిన అధికారులు బిత్తరపోయారు. కొంతకాలం క్రితం బ్యూటీషియన కాంచనాతో పరిచయం అయ్యిందని, తరువాత ఇద్దరి మద్య అక్రమ సంబంధం మొదలైయ్యిందని అధికారులు అన్నారు.

ప్రియురాలి మోజులో?
ప్రియురాలి మోజు తీర్చడానికి అధికారుల నకిలీ సంతకాలు పెట్టిన ప్రకాష్ బీబీఎంపీ అకౌంట్ నుంచి అతని ప్రియురాలు కాంచనా అకౌంట్ కు రూ. 14 లక్ష్లలకు పైగా నగదు బదిలీ చేశాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇంతకాలం ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసిన బీబీఎంపీ ఉద్యోగి ప్రకాష్ తో పాటు అతని ప్రియురాలు కాంచనాను అరెస్టు చేశామని అమృతహళ్లి పోలీసులు తెలిపారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications