లవ్ మ్యారేజ్, భార్య గర్బవతి, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు, ఏం జరిగింది?

బెంగళూరు: సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న యువకుడు వివాహం చేసుకున్నాడు. అందరూ అనుకున్నట్లు అతని జీవితం సాఫీగా సాగలేదు. నటుడికి కూడా సినిమా కష్టాలు ఉంటాయని అతని స్నేహితులు కూడా ఊహించలేకపోయారు. ఎవ్వరూ ఊహించన విధంగా ఆ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కన్నడ సినిమాలు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న సంతప్ జయరామ్ (35) ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు స్యాండిల్ వుడ్ ఉలిక్కిపడింది. కన్నడలో సూపర్ హిట్ అయిన అగ్నిసాక్షితో పాటు పలు సీరియల్స్ లో సంపత్ జయరామ్ లీడ్ రోల్స్ లో నటించాడు. పలు కన్నడ సినిమాల్లో కూడా సంపత్ జయరామ్ నటించాడు.

Kannada actor Sampath Jayaram commits suicide in Bengaluru in Karnataka

సంపత్ జయరామ్ ఆత్మహత్య విషయంలో కన్నడ సినీ పరిశ్రమలో రకరకాలుగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నటుడు సంపత్ జయరామ్ స్నేహితుడు, నటుడు రాజ్ ద్రువ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణ స్నేహితుడు సంపత్ జయరామ్ ఆత్మహత్య చేసుకోవడం తాను నమ్మలేకపోతున్నానని రాజేష్ ద్రువ విచారం వ్యక్తం చేశాడు.

కన్నడ సినిమాలు, టీవీ సిరయల్స్ లో అవకాశాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడటం, ఇంట్లో భార్యతో గొడవలు ఎక్కువ కావడంతో నటుడు సంపత్ జయరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ యూ ట్యూబ్ చానల్ లో, సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు వ్యాపించాయి. ఇదే సమయంలో సంపత్ జయరామ్ ఫ్రెండ్ రాజేష్ ద్రువ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

నటుడు సంపత్ జయరామ్ కు ఓ ఫ్యామిలీ ఉంది. మీరు మీకు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఆయన ఆత్మహత్య గురించి ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చెయ్యడం మంచిదికాదు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటకు వస్తాయని. అంత వరకు అందరూ ఓపికగా ఉండాలని సంపత్ జయరామ్ స్నేహితుడు. కన్నడ నటుడు రాజేష్ ద్రువ సోషల్ మీడియాలో మనవి చేశారు.

ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితుడు రవి ఫోన్ చేశాడని, ఇంత రాత్రిలో ఏం జరిగింది అని ఆరా తీస్తే సంపత్ కు సీరియస్ గా ఉందని చెప్పడంతో తాను ఆసుపత్రికి పరుగు తీశానని నటుడు రాజేష్ ద్రువ వివరించాడు. నేను ఆసుపత్రికి వెళ్లి చూసే సమయానికే తన స్నేహితుడు, నటుడు సంపత్ జయరామ్ ప్రాణాలు పోయాయని నటుడు రాజేష్ ద్రువ విచారం వ్యక్తం చేశారు.

నటుడు సంపత్ జయరామ్ చైతన్యా అనే యువతిని 11 ఏళ్ల నుంచి ప్రేమించాడు. చాలా సంవత్సరాల ప్రేమించుకున్న సంపత్ జయరామ్, చైతన్యా కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. నటుడు సంపత్ జయరామ్ భార్య చైతన్యా ప్రస్తుతం 5 నెలల గర్బవతి అని, ఇలాంటి సమయంలో నటుడి ఆత్మహత్య విషయంలో లేనిపోని పుకార్లు పుట్టించడం మంచిది కాదని నటుడు రాజేష్ ద్రువ మనవి చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+