Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: ఎస్ఐకి కుల పిచ్చి, డబ్బు ఆశ, ప్రేమికులను విడదీశాడు, ఫేస్ బుక్ లైవ్ లో స్టోరీ చెప్పి ఆత్మహత్య!

బెంగళూరు/ బళ్లారి/ రాయచూర్: చాలా కాలం నుంచి పరిచయం ఉన్న యువతి, యువకుడు మొదట స్నేహితులు, తరువాత ప్రేమికులు అయ్యారు. ఇద్దరి మనుసులు కలవడంతో ప్రేమికులు సంతోషంగా తిరిగారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో ప్రేమికుడితో పెళ్లి చెయ్యడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. ఇల్లు విడిచి బయటకు వచ్చేసిన ప్రియురాలు ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. గుడిలో వివాహం చేసుకున్న ప్రేమికులు తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని మనవి చేశారు.

ప్రేమికుల నుంచి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చెయ్యాలని జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కుల పిచ్చితో డబ్బు ఆశతో ప్రేమికులను విడదీసి అతని చేతులు దులుపుకున్నాడు. ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు పిలుచుకుని వెళ్లిపోవడంతో ప్రియుడు ఆవేదనతో రగిలిపోయాడు. తరువాత తనకు ఎస్ఐ చేసిన అన్యాయం గురించి డెత్ నోట్ రాసిపెట్టిన ప్రియుడు ఫేస్ బుక్ లైవ్ లో జరిగిన దారుణం గురించి స్టోరీ మొత్తం చెప్పి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఒకే ఏరియా ప్రేమికులు

ఒకే ఏరియా ప్రేమికులు

కర్ణాటకలోని రాయచూరు సమీపంలోని గాణదాళ ప్రాంతంలో భీమేష్ నాయక్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. భీమేష్ నాయక్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. చాలా కాలం నుంచి పరిచయం ఉన్న స్వప్నా, భీమేష్ నాయక్ మొదట స్నేహితులు, తరువాత ప్రేమికులు అయ్యారు.

కులాలు అడ్డు వచ్చాయి

కులాలు అడ్డు వచ్చాయి

చాలా కాలం బైక్ లో ప్రేమికులు స్వప్నా, భీమేష్ నాయక్ సంతోషంగా కలిసిమెలసి తిరిగారు. ప్రియుడు భీమేష్ నాయక్ కంటే కులంలో అతని ప్రియురాలు స్వప్నా ఎక్కువ కులానికి చెందినది కావడంతో ఆ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారని తెలిసింది. ఇదే విషయంలో ప్రియురాలు స్వప్నాకు ఆమె కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారని తెలిసింది.

పెళ్లికి నో చెప్పిన ఫ్యామిలీ.... ఫ్రెండ్స్ ఓకే చెప్పారు

పెళ్లికి నో చెప్పిన ఫ్యామిలీ.... ఫ్రెండ్స్ ఓకే చెప్పారు

భీమేష్ నాయక్, స్వప్నా కులాలు వేరుకావడంతో ప్రేమికుడితో పెళ్లి చెయ్యడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని ప్రేమికులు భీమేష్ నాయక్, స్వప్నా డిసైడ్ అయ్యారు. ప్రేమికుల పెళ్లి చెయ్యడానికి భీమేష్ నాయక్ స్నేహితులు సిద్దం అయ్యారు.

గుడిలో పెళ్లి...... పోలీసుల ముందు పంచాయితీలు

గుడిలో పెళ్లి...... పోలీసుల ముందు పంచాయితీలు

ఇల్లు విడిచి బయటకు వచ్చేసిన ప్రియురాలు స్వప్నా ఆమె ప్రియుడు భీమేష్ నాయక్ తో కలిసి పారిపోయింది. గుడిలో వివాహం చేసుకున్న ప్రేమికులు భీమేష్ నాయక్, స్వప్నా తమకు రక్షణ కల్పించాలని రాయచూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని మనవి చేశారు. ప్రేమికుల నుంచి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చెయ్యాలని రాయచూరు జిల్లా ఎస్పీ స్థానిక ఇడపనూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

డబ్బు ఆశ, కుల పిచ్చితో ఎస్ఐ చేతివాటం

డబ్బు ఆశ, కుల పిచ్చితో ఎస్ఐ చేతివాటం

ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగప్ప కుల పిచ్చితో డబ్బు ఆశతో ప్రేమికులు భీమేష్ నాయక్, స్వప్నాలను బెదిరించి ఇద్దరినీ విడదీసి అతని చేతులు దులుపుకున్నాడని ప్రియుడు ఆరోపిస్తున్నాడు. ప్రియురాలు స్వప్నాను ఆమె కుటుంబ సభ్యులు పిలుచుకుని వెళ్లిపోయారు. ప్రియురాలు స్వప్నా ఆమె ఇంటికి వెళ్లిపోవడంతో ఆమె ప్రియుడు భీమేష్ నాయక్ ఆవేదనతో రగిలిపోయాడు.

డెత్ నోట్, ఫేస్ బుక్ లైవ్ లో స్టోరీ చెప్పి ప్రియుడి ఆత్మహత్య

డెత్ నోట్, ఫేస్ బుక్ లైవ్ లో స్టోరీ చెప్పి ప్రియుడి ఆత్మహత్య

ఎస్ఐ గంగప్ప అతని ఉద్యోగం అడ్డం పెట్టుకుని డబ్బు ఆశతో తనకు అన్యాయం చేసి తన ప్రియురాలిని దూరం చేశాడని, ఇతను ఎస్ఐ ఉద్యోగంలో ఉంటే అమాయకుల జీవితాలు బలి అవుతాయని, ఇతని వలన తన జీవితం నాశనం అయ్యిందని భీమేష్ నాయక్ డెత్ నోట్ రాసిపెట్టాడు. ఎస్ఐ గంగప్ప చేసిన అన్యాయం గురించి ఫేస్ బుక్ లో లైవ్ లో పూర్తి వివరాలు చెప్పిన భీమేష్ నాయక్ అతను నివాసం ఉంటున్న గాణదాళ గ్రామం సమీపంలోని పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటికే ప్రియుడి ప్రాణాలు పోయాయి

అప్పటికే ప్రియుడి ప్రాణాలు పోయాయి

ఫేస్ బుక్ లైవ్ లో భీమేష్ నాయక్ మాట్లాడిన మాటలు విన్న అతని ఫ్రెండ్స్ పొలం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లే సమయానికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. భీమేష్ నాయక్ డెత్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+