Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Talent: పోలీస్ స్టేషన్ లో పోలీసు జీపు కొట్టేసిన క్రేజీ నాగ, పక్క జిల్లా పోలీసులు చెప్పే వరకు, కిలాడి!

బెంగళూరు/ ధారవాడ: ప్రముఖ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి మంచి జీతం తీసుకునేవాడు. బస్సు నడపడంతో ఆరితేరిన ఆ డ్రైవర్ ఇప్పటి వరకు ఏ వాహనం కూడా ప్రమాదానికి గురి కాకుండా చూసుకున్నాడు. అతను టాలెంట్ ఉన్న డ్రైవర్ అని ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. కరోనా దెబ్బతో ఆ సంస్థ వాహనాలు మూలనపడటంతో అతను పనిలేక ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఊరిలో సొంత కార్లు పెట్టుకున్న కొందరు ఎక్కడైనా బయటకు వెళ్లాలంటే ఇతన్ని డ్రైవర్ గా పెట్టుకుని బయటకు పిలుచుకుని వెలుతున్నారు. మంచి డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను ఖాళీ టైమ్ లో మద్యం సేవిస్తున్నాడు.

అమావాస్య రోజు బార్ లోకి వెళ్లిన డ్రైవర్ పీకలదాక మద్యం సేవించాడు. హ్యాపీగా మందుతాగి నడుచుకుంటూ ఇంటికి వెలుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు గస్తీ తిరగడానికి ఉపయోగించే బోలెరో జీపు నిలబెట్టిన విషయం గమనించాడు. పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు లేకపోవడం, పోలీసు జీపుకు తాళాలు అలాగే ఉండటంతో మనోడు చేతివాటం చూపించాడు. పోలీసు జీపు స్టాట్ చేసి నడుపుకుంటూ హైవే మీద వెళ్లిపోయాడు. జిల్లా దాటేసి హైవే మీద వెలుతున్న డ్రైవర్ కు రోడ్డు పక్కన బార్ కనపడింది.

పోలీసు జీపు దర్జాగా నిలబెట్టిన అతను బార్ లోకి వెళ్లి మద్యం సేవిస్తూ కుర్చున్నాడు. ఆ సమయంలో అక్కడ మందుబాబులకు అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బార్ దగ్గరకు చేరుకుని విచారణ చెయ్యగా క్రేజీ నాగ చెప్పిన మ్యాటర్ తెలుసుకుని షాక్ అయ్యారు. పక్క జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చే వరకు ఆ పక్క జిల్లాలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ల పోలీస్ స్టేషన్ లోని జీపు చోరీ అయ్యింది అనే విషయం గుర్తించలేకపోవడం, విషయం తెలుసుకున్న పై అధికారులు పోలీసు సిబ్బందికి చివాట్లు పెట్టడంతో హడలిపోయారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసు జీపు చోరీ అయినా పోలీసులు గుర్తించలేకపోయారనే విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.

సూపర్ డ్రైవర్

సూపర్ డ్రైవర్

కర్ణాటకలోని ధారవాడ జిల్లాలోని అణ్ణగేరి పట్టణంలోని అంబికా నగర్ లో నాగప్ప అలియాస్ నాగ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. భార్య, కూతురితో కలిసి నాగప్ప సంతోషంగానే ఉండేవాడు. ధారవాడలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్న నాగప్ప మంచి జీతం తీసుకునేవాడు. బస్సు నడపడంతో ఆరితేరిన డ్రైవర్ నాగప్ప ఇప్పటి వరకు ఏ వాహనం కూడా ప్రమాదానికి గురి కాకుండా చూసుకుని టాలెంట్ ఉన్న డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కరోనా దెబ్బతో ఖాళీగా ఉంటున్నాడు

కరోనా దెబ్బతో ఖాళీగా ఉంటున్నాడు

నాగప్ప టాలెంట్ ఉన్న డ్రైవర్ అని ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. కరోనా దెబ్బతో ఆ సంస్థ వాహనాలు, బస్సులు తాత్కాలికంగా మూలనపడటంతో నాగప్ప ఇంట్లో ఉంటున్నాడు. అణ్ణిగేరిలో సొంత కార్లు పెట్టుకున్న కొందరు ఎక్కడైనా బయటకు వెళ్లాలంటే నాగప్పను డ్రైవర్ గా పెట్టుకుని బయటకు పిలుచుకుని వెలుతున్నారు.

హ్యాపీగా ఇంటికి బయలుదేరిన నాగప్ప

హ్యాపీగా ఇంటికి బయలుదేరిన నాగప్ప

మంచి డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగప్ప ఖాళీ టైమ్ లో మద్యం సేవిస్తున్నాడు. అమావాస్య రోజు బార్ లోకి వెళ్లిన డ్రైవర్ నాగప్ప స్నేహితలతో కలిసి పీకలదాక మద్యం సేవించాడు. తరువాత అంబికా నగర్ లోని ఇంటికి హ్యాపీగా మందుతాగిన నాగప్ప సిగరేట్ తాగుతూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు.

పోలీసు జీపు క్రేజీ నాగ కంట్లో పడింది

పోలీసు జీపు క్రేజీ నాగ కంట్లో పడింది

ఇంటికి వెలుతున్న సమయంలో అణ్ణిగేరి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు గస్తీ తిరగడానికి ఉపయోగించే బోలెరో జీపు నిలబెట్టిన విషయాన్ని నాగప్ప గమనించాడు. పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు లేకపోవడం, పోలీసు జీపుకు తాళాలు అలాగే ఉండటంతో నాగప్ప చేతివాటం చూపించాడు. పోలీసు జీపు స్టాట్ చేసిన నాగప్ప దర్జాగా నడుపుకుంటూ బెంగళూరు- పూణే హైవే రోడ్డు మీద జాలీ రైడ్ వెళ్లిపోయాడు.

బార్ కనపడటంతో పోలీసు జీపు ఆపేసి వెళ్లి?

బార్ కనపడటంతో పోలీసు జీపు ఆపేసి వెళ్లి?

ధారవాడ జిల్లా దాటేసిన నాగప్ప హావేరి జిల్లాలోి బ్యాడగి తాలుకాలోని మేటేబెన్నూరు సమీపంలో వెలుతున్న సమయంలో రోడ్డు పక్కన బార్ కనపడటంతో పోలీసు జీపు ఆపేశాడు. పోలీసు జీపు బార్ పక్కనే దర్జాగా నిలబెట్టిన నాగప్ప బార్ లోకి వెళ్లి మద్యం సేవిస్తూ కుర్చున్నాడు. ఆ సమయంలో నాగప్ప తీరును చూసిన అక్కడ మందుబాబులకు అనుమానం వచ్చి బ్యాడగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

క్రేజీ నాగప్ప మ్యాటర్ తెలిసి

క్రేజీ నాగప్ప మ్యాటర్ తెలిసి

బ్యాడగి పోలీసులు బార్ దగ్గరకు చేరుకుని నువ్వు ఎవరు ? ఎక్కడి నుంచి వస్తున్నావు ?, ఏ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నావు అంటూ నాగప్పను ప్రశ్నించారు. పోలీసులు రావడంతో అప్పటి వరకు తాగిన మందు మొత్తం దిగిపోవడంతో డ్రైవర్ నాగప్ప బిత్తరపోయాడు. ఆ సమయంలో తాను క్రేజ్ కోసం పోలీసు జీపు చోరీ చేశానని నాగప్ప చెప్పడంతో బ్యాడగి పోలీసులు బిత్తరపోయారు.

జీపు చోరీ అయిన విషయం ఆ పోలీసులకే తెలీదు

జీపు చోరీ అయిన విషయం ఆ పోలీసులకే తెలీదు

హావేరి జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చే వరకు ధారవాడ జిల్లాలోని అణ్ణిగేరి పోలీస్ స్టేషన్ సిబ్బందికి వాళ్ల పోలీస్ స్టేషన్ లోని జీపు చోరీ అయ్యింది అనే విషయం గుర్తించలేకపోయారని వెలుగు చూడటటంతో అందరూ షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న పై పోలీసు అధికారులు అణ్ణిగేరి పోలీసు సిబ్బందికి చివాట్లు పెట్టడంతో అక్కడి పోలీసులు హడలిపోయారు.

అమావాస్య పూజ కోసం తీసుకెళ్లారని?

అమావాస్య పూజ కోసం తీసుకెళ్లారని?

ప్రతినెల అమావాస్య రోజు పోలీసు జీపును నీట్ గా శుభ్రం చేస్తున్న అణ్ణిగేరి పోలీస్ స్టేషన్ సిబ్బంది పూజలు చేసి ఆ రోజు ఆ వాహనం పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే నిలిపి వేరే వాహనంలో తిరుగుతుంటారని వెలుగు చూసింది. సాటి సిబ్బంది జీపు శుభ్రం చెయ్యడానికి తీసుకెళ్లి ఉంటారని అందరూ ఒకరిమీద ఒకరు అనుకున్నారు. అయితే పోలీసు జీపును క్రేజీ నాగప్ప చోరీ చేశాడని సాటి పోలీసులు గుర్తించలేకపోయారు.

సొంత జీపుకే దిక్కులేదు..... ప్రజల సంగతి?

సొంత జీపుకే దిక్కులేదు..... ప్రజల సంగతి?

పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీసు జీపు చోరీ అయినా పోలీసులు గుర్తించలేకపోయారనే విషయం ఇప్పుడు కర్ణాటకలో రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. సొంత జీపు చోరీ అయితేనే పసిగట్టలేని పోలీసులు ఇక సామాన్య ప్రజల వస్తులులు చోరీ అయితే ఏం న్యాయం చేస్తారు అంటూ అణ్ణిగేరి పోలీసుల మీద జోకులు వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+