షాకింగ్: జీపీఎస్‌ను నమ్మి నేరుగా నట్టేట్లోకి..!
అమెరికాలోని వీమౌంట్ రాష్ట్రంలో ఓ వ్యక్తి జీపీఎస్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకుంటూ తన వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లి నేరుగా వాహనం సహా నట్టేట్లో పడ్డాడు.
వాషింగ్టన్: అప్పుడప్పడు మన మెదడుకు కూడా పని చెప్పాలని... కేవలం యంత్రాల మీద, ఉపగ్రహాల మీద ఆధారపడితే విచక్షణా జ్ఞానం కూడా అంతరించిపోయి మనిషి కూడా ప్రాణం ఉన్న యంత్రంగా మారిపోతాడు.
దీనికి చక్కటి ఉదాహరణ అమెరికాలో జరిగిన ఈఘటన. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్)ను గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్లి నట్టేట్లో పడ్డాడు ఓ వ్యక్తి. అమెరికాలోని వీమాంట్ రాష్ట్రంలో చోటుచేసుకుంది ఈ ఘటన.

తారా గుర్టిన్ అనే పెద్దమనిషి జీప్ కంపాస్‌ను అద్దెకు తీసుకొని.. తన మిత్రబృందాన్ని ఎక్కించుకొని రైడ్‌కు బయల్దేరాడు. వెళ్లాల్సిన మార్గంపై కచ్చితమైన అవగాహన లేకపోవడంతో గూగుల్‌కు చెందిన జీపీఎస్ యాప్ వేజ్‌ను ఆన్ చేశాడు.
ఆ యాప్ చెప్పిన ప్రకారం కొంత దూరం వెళ్లగా ఒక బోట్ ర్యాంప్ వచ్చింది. దీనిని గుర్తించని ఆ వ్యక్తి యాప్ సూచనల మేరకు నేరుగా వాహనాన్ని పోనించాడు. అంతే- వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ నేరుగా ఓ సరస్సులోకి దూకింది.
అప్పటికే హిమపాతం కారణంగా నీరుగడ్డకట్టి ఉండటంతో జీపు కుంగలేదు. సరస్సలో కొద్ది దూరం వెళ్లాక వాహనం బరువుకు ఒక్కసారిగా మంచుపొర పగిలి ముందుభాగం నీటిలోకి కుంగింది. దీంతో ఆ వాహనంలోని ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టకొని బయటపడ్డారు.
సమాచారం అందుకొని అక్కడకు చేరుకొన్న పోలీసులు వాహనాన్ని బయటకు తీశారు. సదరు వాహనాన్ని నడిపిన డ్రైవర్ మద్యం మత్తులో లేడని వారు ధ్రువీకరించారు. కేవలం యాప్ చెప్పిన సూచనలను గుడ్డిగా నమ్మి డ్రైవింగ్ చేయడంతో ఈఘటన జరిగినట్లు తేల్చారు.
వేజ్ యాప్‌కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ యజమాని. దీనిలోని మ్యాప్‌లను మరింత కచ్చితంగా ఉంచేందుకు వినియోగదారులు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఎవరో ఆ మ్యాప్‌ను ఎడిట్ చేయడం వల్ల ఈ ఘటన చోటుచేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.
-
ఇరాన్‌తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఆ వెబ్‌సైట్‌నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications