టోల్‌ గేట్ దాటితే చిక్కుల్లో పడ్డట్టే.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్స్!

రోడ్డుపై వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఎంత ముఖ్యమో.. ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యం. కానీ చాలా మంది పాలసీ గడువు ముగిసినా పట్టించుకోకుండా అలాగే రోడ్లపై తిరుగుతుంటారు. ఇలాంటి వారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తాజాగా గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై టోల్ ప్లాజా దాటగానే మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ పాలసీ గడువు తీరిపోతే క్షణాల వ్యవధిలోనే మీ మొబైల్‌కు భారీ ఫైన్ మెసేజ్ వచ్చేలా సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు.

ముండ్కా టోల్ ప్లాజా వద్ద తొలి ప్రయోగం..

ప్రస్తుతానికి ఈ అత్యాధునిక వ్యవస్థను దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా (Urban Extension Road-II) వద్ద పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ గేట్లకు ఈ విధానాన్ని విస్తరించాలని NHAI భావిస్తోంది. రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కఠిన నిబంధనను తీసుకువస్తున్నారు.

Driving Without Insurance Could Cost You Up To Rupees 10000 As NHAI Tests New Toll Plaza System
ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!
ఫాస్టాగ్ యూజర్లకు ముఖ్య గమనిక: నేటి నుంచి.. !!

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే..

వాహనం టోల్ గేట్ దాటే సమయంలో అక్కడ ఉండే కెమెరాలు, సెన్సర్లు నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తాయి. ఆ వెంటనే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహిస్తున్న 'వాహన్' (Vahan) డేటాబేస్‌తో ఆ వాహన వివరాలను, ఇన్సూరెన్స్ రికార్డులను ఆటోమేటిక్‌గా సరిపోల్చుతాయి. కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లు గుర్తిస్తే.. కొన్ని నిమిషాల్లోనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ (SMS) వస్తుంది. ఆ మెసేజ్‌లో వాహనం నంబర్, టోల్ దాటిన తేదీ, సమయం, ఇన్సూరెన్స్ ఎప్పుడు ముగిసిందనే వివరాలతో పాటు, వెంటనే పాలసీ రెన్యూవల్ చేసుకోవాలని హెచ్చరిక కూడా ఉంటుంది.

టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!
టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!

రూ. 10 వేల వరకు జరిమానా గండం..

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ప్రజా రహదారులపై తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరులకు జరిగే ప్రాణ, ఆస్తినష్టాలకు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే చట్టరీత్యా నేరం. మొదటిసారి పట్టుబడితే వాహన బేసిన్ ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ. 5,000 (ఏది ఎక్కువైతే అది) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రెండోసారి లేదా ఆ తర్వాత పట్టుబడితే ఈ జరిమానా ఏకంగా ఐదు రెట్లు లేదా రూ. 10,000 వరకు పెరుగుతుంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు కానుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+