కుప్పకూలిన బంగారం ధరలు- వారం ప్రారంభంలోనే బిగ్ షాక్
దేశంలో బంగారం, వెండి ధరలు నేడు కుప్పకూలాయి. వారం ప్రారంభంలోనే ఢమాల్ అన్నాయి. వారం చివరి రెండు రోజుల్లో కొంత పుంజుకొన్నప్పటికీ.. మళ్లీ తిరోగమనం బాట పట్టాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువలోని హెచ్చుతగ్గుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఈ తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సుమారు 4,430.00 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు 1,47,280 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 1,35,000 రూపాయల వద్ద లభిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న అంచనాలను తగ్గించాయి. రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఈ వారం పొడవుగా పసిడి, వెండి రేట్లల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 1,500 తగ్గి రూ. 1,47,280కి చేరగా, 22 క్యారెట్ల పసిడి రూ. 1,35,000కి తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,35,150, 24 క్యారెట్లు రూ. 1,47,430, అహ్మదాబాద్లో 22 క్యారెట్లు రూ. 1,34,900, 24 క్యారెట్లు రూ. 1,47,180గా నమోదైంది. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, పూణేల్లో 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం రూ. 1,35,000, 24 క్యారెట్లు రూ. 1,47,280 వద్ద లభిస్తోంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,837, 22 క్యారెట్లు - రూ. 13,660, 18 క్యారెట్లు - రూ. 11,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,809, 22 క్యారెట్లు- రూ. 13,575, 18 క్యారెట్లు - రూ. 11,107
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications