హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్-ఇవాళే తేలుస్తామని ప్రకటన.

తమిళ హీరో, నిర్మాత విశాల్ నిన్న కేంద్ర ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు సీబీఎఫ్సీపై సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కు సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డుకు రూ.6.5 లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. అంతే కాదు దానికి సంబంధించిన ఆధారాల్ని కూడా ఎక్స్ లో బయటపెట్టారు. రెండు అకౌంట్లకు ఈ మొత్తం బదిలీ చేసినట్లు విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై కేంద్రం స్పందించింది.

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్‌ పై తమిళ నటుడు విశాల్ చేసిన అవినీతి ఆరోపణలపై కేంద్రం వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారిని ముంబైకి పంపింది. విశాల్ తన చిత్రం 'మార్క్ ఆంటోనీ'ని సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షలు చెల్లించినట్లు చెప్పిన 24 గంటల తర్వాత సమాచార మంత్రిత్వ శాఖ ఎక్స్ లో దీనిపై స్పందించింది.

centre reacted on tamil hero vishals bribe allegations on cbfc, says inquiry today itself
విశాల్ ఆరోపణల్ని కేంద్రం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. అవినీతికి అస్సలు ఉపేక్షించబోమని ప్రకటించింది. వేధింపులకు గురైన ఇతరులను వివరాలను కూడా అందించమని కోరింది. తమ ప్రభుత్వం అవినీతిని సహించదని, ఇందులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈరోజే విచారణ నిర్వహించడానికి ముంబైకి ఓ సీనియర్ అధికారిని పంపినట్లు ఎక్స్ లో తెలిపింది. దీంతో విశాల్ ఆరోపణల వ్యవహారం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ చర్చకు దారితీస్తోంది.

అంతకుముందు నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో విశాల్.. "అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు. కానీ నిజ జీవితంలో కాదు. జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో. CBFC ముంబై ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా #MarkAntonyHindi వెర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. 2 లావాదేవీలు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు" అంటూ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+