Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

facebook aunty: నాపేరు అనసూయ, అమ్మాయి ఫోటో, డోర్ తీస్తే నాటుకోడి ఆంటీ, రూ. లక్షలు గోవిందా!

చెన్నై/ తిరుచ్చి/ మదురై: అందమైన అమ్మాయి ఫోటో ఫేస్ బుక్ లో పెట్టారు. అమ్మాయి ఎర్రగా, సన్నగా, చాలా అందంగా ఉండటంతో ఓ యువకుడు సొల్లు కార్చకుంటూ ఆమెను ఫేస్ బుక్ లోనే పరిచయం చేసుకున్నాడు. తరువాత అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్న ఆ యువకుడు కొన్ని నెలల పాటు ఆమెతో మాట్లాడాడు. యువకుడికి ఫోన్ చేసిన ప్రతిసారి ఆమె అతడి మగతనం రెచ్చగొట్టే మాటలతో సెక్సీ జోకులు వేసి అతన్ని వలలో వేసుకుంది. ఫేస్ బుక్ లో పరిచయం అయ్యి తనకు చాలా చనువుగా, సెక్సీ జోకులు వేసి మాట్లాడుతున్న యువతి తియ్యటి మాటలు విన్న ఆ యువకుడు సొల్లు కార్చుకుని రూ. 3 లక్షలకు పైగా సమర్పించుకున్నాడు.

చివరికి ఓ బంగారు నెక్లెస్, ఖరీదైన గిఫ్ట్ లు తీసుకున్న ఆ యువకుడు అమ్మాయి అడ్రస్ తెలుసుకుని పోటుగాడి లాగా వెళ్లాడు. అంతే ఆ అడ్రస్ లో అమ్మాయి కాకుండా నాటుకోడి లాంటి ఆంటీ తలుపు తియ్యడంతో ఆ యువకుడికి పిచ్చిపట్టిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఆ యువకుడి స్టోరీ తెలుసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని దీపావళి పండగ చేస్తున్నారు.

సోషల్ మీడియా పిచ్చోడు

సోషల్ మీడియా పిచ్చోడు

తమిళనాడులోని తిరుచ్చి సిటీలో మారుతి పాండియన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు మారుతి పాండియన్ అతని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో 15 గంటలకు పైగా గడుపుతున్నాడు. ప్రతిరోజు నిద్రపోయే టైమ్ లో తప్పా మిగిలిన టైమ్ లో మారుతి పాండియన్ సోషల్ మీడియాలో చాలా అక్టివ్ గా ఉంటున్నాడు. పెద్దలు విపరీతంగా డబ్బులు సంపాధించడంతో మారుతి పాండియన్ ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు.

ఫేస్ బుక్ అనసూయ

ఫేస్ బుక్ అనసూయ

ఫేస్ బుక్ లో ఓ రోజు మారుతి పాండియన్ కు ఎర్రగా, సన్నగా, చాలా అందంగా ఉన్న అమ్మాయి ఫోటో కనపడింది. ఆ అమ్మాయి పేరు అనసూయ అని తెలుసుకున్న మారుతి పాండియన్ ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. రెండు రోజుల తరువాత అనసూయ అనే అమ్మాయి ఫేస్ బుక్ లో మారుతి పాండియన్ తో ఫ్రెండ్ షిప్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా మారుతి పాండియన్, అనసూయ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయ్యారు.

ఫోన్ లో మాటలకే షార్వా కారిపోయింది

ఫోన్ లో మాటలకే షార్వా కారిపోయింది

రెండు నెలలకు అనసూయ ఓ ఫోన్ నెంబర్ మారుతి పాండియన్ కు ఇచ్చింది. అప్పటి నుంచి మారుతి పాండియన్, అనసూయ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. రానురాను అనసూయ మగాళ్లను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ సెక్సీగా అతనితో బూతులు మాట్లాడింది. నిజంగానే అనసూయ మాటలు చాలా తియ్యగా ఉండటంతో మారుతి పాండియన్ ఫోన్ లో మాట్లాడుతున్న ఆమె మాటలకే షార్వా కార్చుకున్నాడు.

రూ. 3 లక్షలు స్వాహా

రూ. 3 లక్షలు స్వాహా

తన దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉందని, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని మారుతి పాండియన్ అనసూయకు చెప్పాడు. అతని ఆశను క్యాష్ చేసుకోవాలని అనసూయ స్కెచ్ వేసింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని మారుతి పాండియన్ కు అనుసూయ మాట ఇచ్చింది. అంతే ఆ తరువాత ఇంకా సెక్సీసెక్సీ జోకులు వేస్తూ మారుతి పాండియన్ మెలికలు తిరిగిపోయేలా మాట్లాడిన అనసూయ కొంత కాలానికి తనకు డబ్బులు అవసరం ఉందని చెప్పింది. తనను అననూయ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందని గుడ్డిగా నమ్మిన మారుతి పాండియన్ ఆమె అడిగినప్పుడల్లా ఇప్పటి వరకు రూ. 3 లక్షలకు పైగా ఆమె బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశాడు.

పోటుగాడు నెక్లెస్ తీసుకుని వెళ్లాడు

పోటుగాడు నెక్లెస్ తీసుకుని వెళ్లాడు

అనసూయ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె ఇంటి అడ్రస్ కనుక్కున్న మారుతి పాండియన్ ఆమెకు ఆశ్చర్యానికి గురి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. రెండు లక్షల రూపాయల విలువైన బంగారు నెక్లెస్, ఖరీదైన గిఫ్ట్ లు తీసుకున్న మారుతి పాండియన్ నేరుగా అనసూయ అడ్రస్ కు వెళ్లాడు. ఇంటి తలుపు తట్టిన మారుతి పాండియన్ ఓ మహిళ బయటకు రావడంతో తాను అనసూయ కోసం వచ్చానని చెప్పాడు.

అనసూయ @ 45

అనసూయ @ 45

మారుతి పాండియన్ ను చూసిన ఆమె ఇంతకాలం తాను ఫేస్ బుక్ లో మాట్లాడింది ఈ వ్యక్తినే అని తెలుసుకుని అయోమయానికి గురైయ్యింది. తన పేరు అనసూయ, ఇంతకాలం నీతో ఫోన్ లో మాట్లాడింది నేను అని ఆమె చెప్పడంతో మారుతి పాండియన్ కళ్లు గిరిగిరా తిరిగిపోయాయి. ఓరి నాయనో నేను ఏదో పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటే పిల్లల తల్లి వచ్చింది ఏందిరా దేవుడా అంటూ లబోదిబో అన్నాడు. నిజంగా ఆ ఇంట్లో ఉన్న ఆమె పేరు అనసూయ (45) అని తెలుసుకున్న మారుతి పాండియన్ మోసం జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు.

Recommended Video

    WhatsApp Pay UPI Payments Launched in India వాట్సాప్ ద్వారా డబ్బు చెల్లింపులు...!! | Oneindia Telugu
    భర్త, భార్య, తమ్ముడి స్కెచ్

    భర్త, భార్య, తమ్ముడి స్కెచ్

    పోలీసులు రంగంలోకి దిగి అనసూయను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకాలం తన భర్త సెల్వరాజ్, తమ్ముడు మణితో కలిసి తానే మారుతి పాండియన్ తో ఫోన్ లో మాట్లాడానని, తన పేరు అనసూయ అని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే మారుతి పాండియన్ దగ్గర డబ్బులు తాను తీసుకోలేదని, తన భర్త, తమ్ముడు తీసుకున్నారని అనసూయ అడ్డం తిరిగింది. అనసూయ, ఆమె భర్త, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేసిన పాపానికి రూ. 3 లక్షలు గోవిందా అంటూ మారుతి పాండియన్ లబోదిబో అంటున్నాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+