Girlfriend: కాలేజ్ అమ్మాయితో కొన్ని ఏళ్లు ఎంజాయ్, చేతులు ఎత్తేసిన ప్రియుడు, తెగించిన ప్రియురాలు!

చెన్నై/తిరువణ్ణామలై: పట్టువదలని విక్రమార్కుడిలా కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు చివరికి లొంగదీసుకున్నాడు. అమ్మాయి డిగ్రీ పూర్తి అయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. యువతితో ఎంజాయ్ చేసి మోజు తీర్చుకున్న ప్రియుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రేమించి మోసం చేసిన ప్రియుడిని ప్రియురాలు నిలదీసింది.

ఇంతకాలం ఎంజాయ్ చేశావు, ఎవడినో ఒకడిని చూసి పెళ్లి చేసుకో, లేదంటే ముక్కు చెవులు కోసి కారం పెడుతామని ప్రియుడితో పాటు అతని బంధువులు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. తరువాత ఆ అమ్మాయి ఏం జరిగితే అది జరగని అని తెగించడంతో ప్రియుడికి సినిమా కనపడింది.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని కలిపెన్నత్తూరు సమీపంలోని భూతమంగలంలో యోహోమలై (30) అనే యువకుడు ివాసం ఉంటున్నాడు. యోహోమలై నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని మరో గ్రామంలో 23 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఐదు సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువుతున్న సమయంలో యోహోమలై ఆమె మీద కన్ను వేశాడు.

వెంటపడి లొంగదీసుకున్న కేటుగాడు

వెంటపడి లొంగదీసుకున్న కేటుగాడు

డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి వెంటపడిన మోహోమలై నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆమెను వేధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె వెంటపడిన యోహోమలై చివరికి ఆమెను లొంగదీసుకున్నాడు. అమ్మాయి కూడా యోహోమలైని గుడ్డిగా నమ్మి అతన్ని ప్రేమించింది. రెండు సంవత్సరాల క్రితం ప్రియురాలు డిగ్రీ పూర్తి చేసింది.

ఎంజాయ్ చేసి చేతులు ఎత్తేసిన ప్రియుడు

ఎంజాయ్ చేసి చేతులు ఎత్తేసిన ప్రియుడు

పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించిన యోహోమలై ఆమెను విహారయాత్రలకు పిలుచుకుని వెళ్లి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. మూడు సంవత్సరాల నుంచి ప్రియురాలితో యోహోమలై జల్సాలు చేస్తున్నాడు. ఇటీవల ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చిన యోహోమలై వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.

ప్రియురాలికి తెలిసిపోయింది

ప్రియురాలికి తెలిసిపోయింది

తన ప్రియుడు యోహోమలై మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఆమెతో పెళ్లికి సిద్దం అయ్యాడని ప్రియురాలికి తెలిసిపోయింది. ప్రేమించి మోసం చేసిన ప్రియుడు యోహోమలైని అతని ప్రియురాలు నిలదీసింది. నన్ను పెళ్లి చేసుకోవాలని, ఇంతకాలం నాతో శారీరక సంబంధం పెట్టుకున్నావని, నన్ను మోసం చెయ్యకూడదని ప్రియురాలు మనవి చేసింది.

ప్రియుడికి దూలతీరిపోయింది

ప్రియుడికి దూలతీరిపోయింది

ఇంతకాలం నాతో ఎంజాయ్ చేశావు, ఎవడో ఒకడు తలమాసినోడిని చూసి పెళ్లి చేసుకో, లేదంటే ముక్కు చెవులు కోసి కారం పెడుతామని ప్రియుడు యోహోమలైతో పాటు అతని బంధువులు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు. ఎంత చెప్పినా ప్రియుడు యోహోమలై పద్దతి మార్చుకోకపోవడం, చంపేస్తానని బెదిరించడంతో ప్రియురాలు పోలీసు కేసు పెట్టింది.

పోలీసులకు సాక్షాలు ఇచ్చిన ప్రియురాలు

పోలీసులకు సాక్షాలు ఇచ్చిన ప్రియురాలు

యోహోమలైతో పాటు అతని బంధువులు ముగ్గురి మీద కేసు నమోదు చేసిన పోలీసులు అందరిని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు. గతంలో కలసి తిరిగిన సమయంలో యోహోమలైతో కలసి తీసుకున్న ఫోటోలు, వీడియోలను ప్రియురాలు పోలీసులకు ఇచ్చిందని తెలిసింది. ఏం జరిగితే అది జరగని అని ప్రియురాలు తెగించడంతో ప్రియుడికి ఇప్పుడు సినిమా కనపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+