Girlfriend: ప్రియురాలితో ?, రోజూ 90 ఎంఎల్ నుంచి రెండు క్వాటర్లకు వచ్చాడు, రివర్స్, ఇంట్లో దూరి!
చెన్నై: యువతి, యువకుడికి నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. చూపులు కలవడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతిని వివాహం చేసుకోవాలని ఆమె ప్రియుడు అనుకున్నాడు. యువతి కూడా ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే ప్రియుడు 90 ఎంఎల్ నుంచి రోజు క్వాటర్, రెండు క్వాటర్లు మందు తాగడం మొదలు పెట్టాడు. నీ ప్రియుడు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫుల్ టైట్ గా మద్యం సేవిస్తాడని, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు ఏడుస్తూ ఉంటావని, నువ్వు ఏడవడమేకాకుండా మమ్మల్ని కూడా ఏడిపిస్తావని, ఈ పెళ్లికి మేము అంగీకరించమని ప్రియురాలి తల్లిదండ్రులు తేల్చి చెప్పారు.
పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రియురాలు కూడా ఆమె ప్రియుడిని ధైర్యంగా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసింది. తన ప్రియురాలు దూరం అయ్యిందని ప్రియుడు రగిలిపోయాడు. పగలే ఫుల్ గా మందు తాగిన ప్రియుడు నేరుగా ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. కత్తి తీసుకుని ప్రియురాలిని ఇష్టం వచ్చినట్లు పొడి చేసిన ప్రియుడు ఇంటి లోపల లాక్ చేసుకుని అతను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ప్రియుడు, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అంటున్నారు.

ప్రేమికులు
చెన్నైలోని కనగం కట్టుబోమ్మన్ వీధిలో అరుల్, విజయ దంపతులు నివాసం ఉంటున్నారు అరుల్, విజయ దంపతులకు అర్చనా (22) అనే కుమార్తె ఉంది. చెన్నైలోని గుమ్మడిపూండి ప్రాంతంలో అజిత్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అర్చనా, అజిత్ కు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. చూపులు కలవడంతో అజిత్, అర్చనా ప్రేమించుకున్నారు.

హ్యాపీగా ఎంజాయ్ చేశారు
నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న అర్చనా, అజిత్ సంతోషంగా తిరిగారు. ప్రియుడు అజిత్ బైక్ లో అర్చనా షికార్లకు తిరిగింది. ప్రియురాలు అర్చనాతో కలిసే సమయంలో ఆమె ప్రియుడు అజిత్ చాలా బుద్దిమంతుడిలా ప్రవర్తించాడు. అజిత్ చాలా మంచివాడని అర్చనా కూడా గుడ్డిగా నమ్మింది.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ప్రేమికులు
అర్చనా, అజిత్ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఎలాగైనా ఇంట్లో చెప్పి తన ప్రియుడు అజిత్ ను పెళ్లి చేసుకోవాలని అర్చనా కూడా అనుకుంది. ప్రియురాలు అర్చనాతో కలిసే సమయంలో బుద్దిగా ఉంటున్న అజిత్ ప్రియురాలు వెళ్లిపోయిన తరువాత మందు తాగి జల్సాలు చేసేవాడని తెలిసింది. చాలా కాలం అజిత్ రోజూ మందు తాగుతాడని అతని ప్రియురాలు అర్చనాకు తెలీలేదు.

రోజూ 90 ఎంఎల్ నుంచి క్వాటర్, రెండు క్వాటర్లు
అర్చనా, అజిత్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలోనే ప్రియుడు రోజూ 90 ఎంఎల్ నుంచి రోజూ క్వాటర్, రెండు క్వాటర్లు మందు తాగడం మొదలు పెట్టాడు. తాను అజిత్ ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని, మా పెళ్లి మీరే చెయ్యాలని అర్చనా ఆమె తల్లిదండ్రులు అరుల్, విజయకు చెప్పింది. కూతురు అర్చనా మ్యాటర్ తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అజిత్ గురి ఆరా తీశారు.

నీతో పాటు జీవితాంతం మేము ఏడుస్తాము జాగ్రత్త
నీ ప్రియుడు అజిత్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫుల్ టైట్ గా మద్యం సేవిస్తాడని, అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం నువ్వు ఏడుస్తూ ఉంటావని, నువ్వు ఏడవడమేకాకుండా మమ్మల్ని కూడా ఏడిపిస్తావని, ఈ పెళ్లికి మేము అంగీకరించమని ప్రియురాలు అర్చనాకు ఆమె తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రియురాలు అర్చనా కూడా ఆమె ప్రియుడు అజిత్ ను ధైర్యంగా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసింది.

రగిలిపోయిన ప్రియుడు
నువ్వు పూర్తిగా మందు మానేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని, లేదంటే లేదని అర్చనా ఆమె ప్రియుడు అజిత్ కు తేల్చి చెప్పింది. అయితే అజిత్ మాత్రం మందు తాగకుండా ఉండలేకపోయాడు. ప్రియురాలు అర్చనా కలవడం కూడా మానేయడంతో అజిత్ రగిలిపోయాడు. తన ప్రియురాలు అర్చనా దూరం అయ్యిందని ప్రియుడు అజిత్ అసహనంతో ఊగిపోయాడు.

ఇంట్లో దూరి ప్రియురాలిని కత్తితో?
పగలే ఫుల్ గా మందు తాగిన ప్రియుడు అజిత్ నేరుగా ప్రియురాలు అర్చనా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అర్చనా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇంకా రెచ్చిపోయిన అజిత్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అక్కడ అర్చనా, అజిత్ మద్య మాటామాటా పెరిగిపోయింది. వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకున్న అజిత్ అతని ప్రియురాలు అర్చనా గొంతు, మెడ, ఛాతి మీద ఇష్టం వచ్చినట్లు పొడి చేశాడు.

ఇంట్లో లాక్ చేసుకుని ప్రియుడి ఆత్మహత్యాయత్నం
అజిత్ కత్తితో దాడి చెయ్యడంతో అర్చనా గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు అర్చనా ఇంటి దగ్గరకు పరుగు తీశారు. స్థానికులు చంపేస్తారని భయంతో ప్రియుడు అజిత్ అర్చనా ఇంటి లోపల లాక్ చేసుకుని అతను కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి అర్చనా, అజిత్ ను ఆసుపత్రికి తరలించి ఇద్దరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అర్చనా, అజిత్ పరిస్థితి విషమంగానే ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications