Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: ఇంటి ముందు లేడీ తల, బస్ స్టాండ్ లో యువకుడి తల నరికేశారు, పశుపతి ఇంటి ముందు తల గిఫ్ట్!

చెన్నై/దిండుగల్: రైతు సమైక్య సంఘం వ్యవస్థాపకుడు ఆ ప్రాంతంలోని ప్రజల దగ్గర, రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పక్కాప్లాన్ తో రైతు సమైక్య సంఘం వ్యవస్థాపకుడిని దారుణంగా నరికి చంపేశారు. రైతు సంఘం నాయకుడి హత్య కేసులో మహిళతో పాటు 18 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ ఇంకా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో రైతు సంఘం నాయకుడిని ఇంటి నుంచి బయటకు పిలిపించి హత్య చేయించిందని, హంతకులకు ఆశ్రయం ఇచ్చిందని ఆ మహిళ మీద కేసు నమోదు అయ్యింది.

రైతు సంఘం నాయకుడి హత్య కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న లేడీని కొందరు నడిరోడ్డు తల నరికి చంపేశారు. లేడీ తల ఎత్తుకుని కొన్ని సంవత్సరాల క్రితం హత్యకు గురైన రైతు సంఘం నాయుడి ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. అదే రోజు బస్ స్టాండ్ సమీపంలో యువకుడి తల నరికి చంపడం కలకలం రేపింది. లేడీ హత్యకు, యువకుడి హత్యకు ఏమైనా సంబంధం ఉందా ? అనే విషయం అంతుచిక్కకపోవడం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రైతు సమైక్య నాయకుడు

రైతు సమైక్య నాయకుడు

తమిళనాడులోని దిండుగల్ సమీపంలోని నందనపట్టి ప్రాంతానికి చెందిన పశుపతి పాండియన్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం దేవేంద్రకుల రైతు సమైఖ్య సంఘం స్థాపించాడు. రైతు సమైక్య సంఘం వ్యవస్థాపకుడు పశుపతి పాండియన్ దిండుగల్ జిల్లాతో పాటు తమిళనాడులోని అన్ని ప్రాంతంల్లోని ప్రజల దగ్గర, రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు.

రైతు సంఘం నాయకుడి దారుణ హత్య

రైతు సంఘం నాయకుడి దారుణ హత్య

రైతు సంఘం నాయకుడు పశుపతి పాండియన్ కు మిత్రులతో పాటు శత్రువులు ఎక్కువ అయ్యారు. 2010 సెప్టెంబర్ 22వ తేదీన పక్కాప్లాన్ తో రైతు సమైక్య సంఘం వ్యవస్థాపకుడు పశుపతి పాండియన్ ను నడిరోడ్డులో దారుణంగా నరికి చంపేశారు. రైతు సంఘం నాయకుడు పశుపతి పాండియన్ హత్య కేసులో సుభాష్ పన్నయ్యర్ తో పాటు నిర్మలా దేవి అనే మహిళతో సహ 18 మంది నిందితులుగా ఉన్నారు. కోర్టులో ఈ కేసు విచారణ ఇంకా జరుగుతోంది.

ఇంటి నుంచి బయటకు పిలిపించిన లేడీ

ఇంటి నుంచి బయటకు పిలిపించిన లేడీ

రైతు సంఘం నాయకుడు పశుపతి పాండియన్ ను ఆ రోజు ఇంటి నుంచి బయటకు పిలిపించి హత్య చేయించిందని, హంతకులకు ఆశ్రయం ఇచ్చిందని నిర్మలా దేవి మీద కేసు నమోదు అయ్యింది. పశుపతి పాండియన్ హత్య కేసులో నిర్మలా దేవి ఐదవ నిందితురాలిగా ఉంది. నిర్మలా దేవి కారణంగానే పశుపతి పాండియన్ ఆ రోజు ఇంటి నుంచి బయటకు వచ్చి హత్యకు గురైనాడని ఆరోపణలు ఉన్నాయి.

నడిరోడ్డులో లేడీ తల నరికి ఎత్తుకెళ్లారు

నడిరోడ్డులో లేడీ తల నరికి ఎత్తుకెళ్లారు

బుధవారం రాత్రి నందవనపట్టిలోని ఏపీ కాలనీలోని డేవిడ్ నగర్ లోని ఇంటి ముందు నిర్మలా దేవి నిలబడి ఉంది. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిర్మలా దేవి ఇంటి ముందుకు వెళ్లారు. ఇంటి ముందు నిలబడి ఉన్న నిర్మలా దేవిని పట్టుకుని ఆమె తలను వేటకొడవళ్లతో నరికేశారు. నిర్మలా దేవి తల, మొండెం వేర్వేరుగా నరికేశారు.

పశుపతి ఇంటి ముందు తల పెట్టి పరార్

పశుపతి ఇంటి ముందు తల పెట్టి పరార్

రైతు సంఘం నాయకుడు పశుపతి పాండియన్ హత్య కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న లేడీ నిర్మలా దేవిని కొందరు నడిరోడ్డు తల నరికి చంపేసి ఆమె తల ఎత్తుకుని కొన్ని సంవత్సరాల క్రితం హత్యకు గురైన రైతు సంఘం నాయుడి ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. నిర్మలా దేవి ఇంటి ముందే ఆమె మొండెం వదిలేయడం కలకలం రేపింది.

ప్రతీకారంతో లేడీ హత్య?

ప్రతీకారంతో లేడీ హత్య?

విషయం తెలుసుకున్న దిండుగల్ గడ్డం పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మలా దేవి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిండుగల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. రైతు సంఘం నాయకుడు పశుపతి పాండియన్ హత్యకు గురైన సెప్టెంబర్ 22వ తేదీకి కచ్చితంగా 11 సంవత్సరాల తరువాత అదే సెప్టెంబర్ 22వ తేదీ రాత్రి నిర్మలా దేవి హత్యకు గురికావడంతో ప్రతీకారంగానే ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బస్ స్టాండ్ లో యువకుడి తల నరికి హత్య

బస్ స్టాండ్ లో యువకుడి తల నరికి హత్య

నిర్మలా దేవి హత్యకు గురైన రోజే దిండుగల్ సమీపంలోని అనుమంతరాయన్ కోట బస్ స్టాండ్ సమీపంలో స్టీఫెన్ అనే యువకుడి తల నరికి చంపడం కలకలం రేపింది. బస్ స్టాండ్ దగ్గర నిలబడిన ఉన్న స్టీఫెన్ ను గుర్తు తెలియన వ్యక్తులు వేటకొడవళ్లు దాడి చేసి అతని తల నరికి చంపేయడం కలకలం రేపింది. నిర్మలా దేవి హత్యకు, యువకుడి హత్యకు ఏమైనా సంబంధం ఉందా ? అనే విషయం అంతుచిక్కకపోవడం దిండుగల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే రోజు ఇద్దరి తలలు నరికి హత్య చెయ్యడం దిండుగల్ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+