Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chennai: ప్రియుడితో రెండో భార్య రొమాన్స్, పద్దతి మార్చుకో పద్మావతి, మడతపెట్టేసిన మామ, కంపెనీలో!

చెన్నై/ తేన్ కాశి: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో కాపురం చేశాడు. కొంతకాలం తరువాత ఆ యువకుడు మానసిక అస్వస్థతకు గురైనాడు. భర్త పనికిరాడని డిసైడ్ అయిన భార్య అతనికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు.

భర్తతో కాపురం చేస్తున్న రెండో భార్య ఉద్యోగంలో చేరింది. మానసిక అస్వస్థతతో సతమతం అవుతున్న భర్తతో పడక సుఖం దక్కడం లేదని అతని రెండో భార్య ఉద్యోగం చేస్తున్న చోట ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం పాటు రెండో భార్య రొమాన్స్ చాలా సీక్రేట్ గా సాగిపోయింది. విషయం తెలుసుకున్న భర్త తండ్రి అతని కోడలికి బుద్దిమాటలు చెప్పాడు. పద్దతి మార్చుకో పద్మావతి అంటూ ఎంతచెప్పినా మాటవినని కోడలిని ఆమె మామ మడతపెట్టేశాడు.

జెండా ఎత్తేసిన భార్య

జెండా ఎత్తేసిన భార్య

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని సెంగోట్టాయి సమీపంలోని లాలగుడిఇరివు గ్రామంలో మురగేషన్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మురగేషన్ కుమారుడు ఇసాకిరాజ్ కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న ఇసాకిరాజ్ అతని భార్యతో కాపురం చేశాడు. కొంతకాలం తరువాత ఇసారిరాజ్ మానసిక అస్వస్థతకు గురైనాడు.

జెండా ఎత్తేసిన భార్య..... భర్తకు రెండో పెళ్లి

జెండా ఎత్తేసిన భార్య..... భర్తకు రెండో పెళ్లి

మానసిక అస్వస్థతకు గురైన భర్త ఇసాకిరాజ్ పనికిరాడని డిసైడ్ అయిన భార్య అతనికి విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఇసాకిరాజ్ పద్మావతి (30) అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. భర్త ఇసాకి్ రాజ్ తో కాపురం చేస్తున్న అతని రెండో భార్య పద్మావతి కమాండ్ క్వాటర్స్ సమీపంలోని గొడుగులు తయారు చేసే కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

ప్రియుడితో రెండో భార్య రొమాన్స్

ప్రియుడితో రెండో భార్య రొమాన్స్

ఉద్యోగం చేస్తున్న కంపెనీలో సెల్వరాజ్ అనే యువకుడు పద్మావతికి పరిచయం అయ్యాడు. రానురాను పద్మావతికి సెల్వరాజ్ దగ్గర అయ్యాడు. మానసిక అస్వస్థతతో సతమతం అవుతున్న భర్త ఇసాకిరాజ్ తో పడక సుఖం దక్కడం లేదని అతని రెండో భార్య పద్మావతి ఉద్యోగం చేస్తున్న చోట సెల్వరాజ్ ను సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

వార్నింగ్ ఇచ్చిన మామ

వార్నింగ్ ఇచ్చిన మామ

చాలాకాలం పాటు ఇసాకిరాజ్ రెండో భార్య పద్మావతిల రొమాన్స్ చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే కొంతకాలం క్రితం పద్మావతి మ్యాటర్ ఆమె ఇంటిలో తెలిసిపోయింది. పద్మావతి అక్రమ సంబంధం విషయంలో ఆమె భర్త ఇసాకిరాజ్, మామ మురగేషన్ ఆమెతో గొడవపడటం మొదలుపెట్టారు. ఇదే సందర్బంలో మామ మురగేషన్ అతని కోడలు పద్మావతికి బుద్దిమాటలు చెప్పాడు.

పద్దతి మార్చుకో పద్మావతి..... మడత పెట్టిన మామ

పద్దతి మార్చుకో పద్మావతి..... మడత పెట్టిన మామ

మామ మురగేష్ చెప్పినా పద్మావతి మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. పద్దతి మార్చుకో పద్మావతి లేదంటే చంపేస్తా అంటూ మామ మురగేష్ వార్నింగ్ ఇచ్చాడు. మామమాటలు కూడా లెక్కచెయ్యని పద్మావతి ఆమె ప్రియుడు సెల్వరాజ్ తో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. సహనం కోల్పోయిన మామ మురగేష్ రాత్రి నిద్రపోతున్న కోడలు పద్మావతి గొంతు నులిమి హత్య చేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+