Wife: భార్య మీద డౌట్, మద్యలో అత్తమామలు ఎంట్రీ, అల్లుడు ఏం చేశాడంటే ?, మామను లేపేసి అత్తను!

చెన్నై/చెంగలపట్టు: ఒకే ఏరియాలో ఉన్న యువతి, యువకుడు వివాహం చేసుకున్నారు. మద్యం షాపులు దూరం ఉండటంతో భర్త అక్రమంగా బ్లాక్ లో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. భర్త అక్రమ మద్యం వ్యాపారానికి భార్య కూడా మద్దతు ఇచ్చింది. దంపతులు ఇద్దరు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో దంపతుల మద్యం వ్యాపారానికి చెక్ పడింది. ఇదే సమయంలో భార్య మీద భర్త అనుమానం పెంచుకున్నాడు. మద్యంకు పూర్తిగా బానిస అయిన భర్త లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి డబ్బులు ఇవ్వాలని అతని భార్యను పీడించడం మొదలు పెట్టాడు.

భార్య మీద విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు. దంపతుల మద్య గొడవ జరగడం, మద్యలో అత్తమామలు, భార్య సోదరులు జోక్యం చేసుకున్నారు. ఆ సందర్బంలో భార్య మీద కోపంతో ఆమె తండ్రిని హత్య చేసి, అత్తను, బావల మీద దాడి చేసిన భర్త కసి తీర్చుకున్నాడు.

అందరివాడు

అందరివాడు

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని కలత్తూరు పాత కాలనీలో జయంతి (30) అనే యువతి నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న తర్జన్ (35) అనే యువకుడికి, జయంతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యం షాపులు దూరం ఉండటంతో తర్జన్ అక్రమంగా బ్లాక్ లో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు.

భర్తతో కలిసి లిక్కర్ వ్యాపారం చేస్తున్న భార్య

భర్తతో కలిసి లిక్కర్ వ్యాపారం చేస్తున్న భార్య

భర్త తర్జన్ అక్రమ మద్యం వ్యాపారానికి అతని భార్య జయంతి కూడా మద్దతు ఇచ్చింది. తర్జన్, జయంతి దంపతులు ఇద్దరు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆరు నెలల క్రితం పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో తర్జన్, జయంతి దంపతుల మద్యం వ్యాపారానికి చెక్ పడింది. తరువాత తర్జన్ చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

భార్య జయంతి మీద భర్త అనుమానం పెంచుకున్న తర్జన్ మద్యం మత్తులో ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. మద్యంకు పూర్తిగా బానిస అయిన తర్జన్ లిక్కర్ కొనుగోలు చెయ్యడానికి డబ్బులు ఇవ్వాలని అతని భార్య జయంతిని పీడించడం మొదలు పెట్టాడు. రానురాను తర్జన్ అతని భార్య జయంతి మీద విపరీతంగా అనుమానం పెంచుకున్నాడు.

భార్య మీద కోపంతో మామను చంపేసి అల్లుడు

భార్య మీద కోపంతో మామను చంపేసి అల్లుడు

జయంతి, తర్జన్ దంపతుల మద్య గొడవ జరగడంతో సమీపంలోనే నివాసం ఉంటున్న అతని అత్తమామలు తులుకునం, సంపూర్ణమ్మ అక్కడికి వెళ్లి అల్లుడు తర్జన్ కు బుద్దిమాటలు చెప్పారు. అదే సమయంలో జయంతి సోదరులు అక్కడికి చేరుకుని గొడవలో జోక్యం చేసుకున్నారు. ఆ సందర్బంలో భార్య జయంతి మీద కోపంతో మద్యం మత్తులో ఉన్న తర్జన్ ఆమె కుటుంబ సభ్యుల మీద దాడి చేశాడు. తర్జన్ దాడిలో జయంత్రి తండ్రి తలుకునం చనిపోయాడు. అత్త సంపూర్ణమ్మ, బావలకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+