జగన్ కు మహిళా వాలంటీర్ సెల్ఫీ వీడియో-వైసీపీ వేధింపుల నుంచి కాపాడాలని వినతి

ఏపీలోని గుంటూరు జిల్లాలో దళిత, మహిళా వాలంటీర్ కు ఓ ప్రజా ప్రతినిధి నుంచి వేధింపులు మొదలయ్యాయి. తాజాగా అవి కాస్తా తీవ్రమయ్యాయి. దీంతో వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళా వాలంటీర్ సీఎం జగన్ దృష్టికి వాటిని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

గుంటూరు జిల్లాలోని నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు స్ధానికంగా ఉండే చెవుల యామిని అనే ఓ మహిళా వాలంటీర్ ను కొంతకాలంగా వేధిస్తున్నాడు. దళిత కుటుంబానికి చెందిన సదరు వాలంటీర్ ఉద్యోగం చేస్తూనే డీఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. ఈ మధ్య తన ప్రియురాలు కూతురిని వాలంటీర్ గా పెట్టించాలని కోరుతూ యామినిని యల్లారావు వేధిస్తున్నాడు.
దీంతో అది తన పరిధిలో లేదనే విషయాన్ని ఆమె చెప్పిచూసింది. అయినా అతను వినలేదు. దీంతో వేధింపులపై ఇక ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

guntur women volunteer selfie video to cm jagan, asked to save her from ysrcp mpp harrassment

నాదెండ్ల ఎంపీపీ కూడా అయిన యల్లారావు వేధింపులపై బాధిత వాలంటీర్ యామిని ఇవాళ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ విడియో తీసి పెట్టింది. ఇందులో సదరు యల్లారావు తనను ఎలా వేధిస్తున్నాడో పూసగుచ్చినట్లు యామిని వివరించింది. అతని బారి నుంచి కాపాడాలని వేడుకుంది సీఎం జగన్ తో పాటు హోంమంత్రి సుచరిత కూడా నివసిస్తున్న గుంటూరు జిల్లాలోనే వైసీపీ మహిళా వాలంటీర్ పై వేధింపులు చోటు చేసుకోవడం, అది కాస్తా సెల్ఫీ వీడియో రూపంలో బయటికి రావడంతో అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

వైసీపీ ఎంపీపీ వేధింపుల నుంచి తనను కాపాడాలని దళిత, మహిళా వాలంటీర్ పెట్టిన సెల్ఫీ వీడియోపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గతంలోనూ సొంత పార్టీ నేతల నుంచి తమను రక్షించాలని జగన్ కు పలువురు వాలంటీర్లు అభ్యర్ధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సీఎం ఉండే జిల్లాలోనే మహిళా వాలంటీర్ కు రక్షణ లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే మహిళల భద్రతపై రోజువారీ స్పీచ్ లు ఇస్తున్న సీఎం జగన్, మంత్రులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+