Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా - టీడీపీలోకి ఎంట్రీ..!!

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనకు గుర్తింపు లభించటం లేదని.. సీఎం ను కలిసే అవకాశం కొందరి కారణంగా తనకు దక్కటం లేదని చెప్పుకొచ్చారు. తాను 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్ది గెలుపు కోసం పని చేసానని..తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా పని చేసిన రామారావు ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, సీటు పైన ఇంకా ఆయనకు హామీ దక్కలేదని తెలుస్తోంది.

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తాను వైసీపీ ఎందుకు వీడుతుందీ వివరించారు. తాను పార్టీకి అనుగుణంగా నడుచుకుంటున్నా..గుర్తింపు లభించటం లేదన్నారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు పార్టీ అభ్యర్ధి ప్రస్తుత హోం మంత్రి తానేటి వనితను గెలిపిస్తే భవిష్యత్ లో పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. కానీ, తనకు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా.. కొందరు అడ్డుకుంటున్నారని చెప్పారు. కనీసం సీఎం అప్పాయింట్ మెంట్ కూడా లేకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కొందరికే పదవులు దక్కుతున్నాయని.. పార్టీ పదవి కోరినా పట్టించుకోలేదన్నారు. కొందరు ముఖ్య నేతలు సీఎం వద్దకు వెళ్లేందుకు తనకు అవకాశం ఇవ్వటం లేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నానని రామారావు వివరించారు.

Kovvur ex mla TV Rama Rao resgin for YSRCP, likely to re join in TDP

రామారావు వైసీపీ వీడి జనసేనలో చేరుతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రామారావు ఖండించారు. తాను జనసేనలో చేరటం లేదని స్పష్టత ఇచ్చారు. 2009లో రామారావు కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్దిగా గెలుపొందారు. ఆ తరువాత చోటు చేసుకున్న ఒక వివాదంలో ఆయన చిక్కుకున్నారు. 2014,2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆ సమయంలోనే రామారావు వైసీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో తానేటి వనిత విజయానికి తోడ్పాటు అందించాలని పార్టీ నేతలు సూచించారు. ఇక, ఇప్పుడు తిరిగి ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో రామారావు తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీటుకు సంబంధించి ఇంకా హామీ దక్కలేదని సమాచారం. తిరిగి టీడీపీలోకి వెళ్లాలని రామారావు ఆలోచనగా ప్రచారం సాగుతోంది.

Kovvur ex mla TV Rama Rao resgin for YSRCP, likely to re join in TDP
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+